శోభాయమానంగా పూరీ జగన్నాథుని రథయాత్ర

by Taduka Kalyani |

భక్తుల జయ జయ ధ్వనాల మధ్య పటాన్ చెరు పట్టణంలోని పూరి జగన్నాథుడి రథయాత్ర అత్యంత వైభవంగా సాగింది.

శోభాయమానంగా పూరీ జగన్నాథుని రథయాత్ర
X

దిశ, పటాన్ చెరు టౌన్ : భక్తుల జయ జయ ధ్వనాల మధ్య పటాన్ చెరు పట్టణంలోని పూరి జగన్నాథుడి రథయాత్ర అత్యంత వైభవంగా సాగింది. పట్టణంలోని శ్రీ కోదండ సీతారామ స్వామి దేవాలయం వద్ద హరే రామ హరే కృష్ణ గోల్డెన్ టెంపుల్ వారి ఆధ్వర్యంలో శనివారం ఏర్పాటు చేసిన రథయాత్రను ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై బంగారు చీపురుతో రథయాత్ర మార్గాన్ని ఊడ్చి.. రథాన్ని లాగి ప్రారంభించారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన రథంపై జగన్నాథ, బలభద్ర, సుభద్రల విగ్రహాలను అందంగా అలంకరించారు. చిన్నారులు, మహిళలు, హరే రామ హరే కృష్ణ గోల్డెన్ టెంపుల్ సభ్యులు కీర్తనలు పాడుతూ పట్టణ పురవీధుల గుండా రథయాత్రను నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పూరిలో జరిగే జగన్నాథుడి రథయాత్ర ప్రపంచంలోనే అతి పురాతనమైన హిందూ ఆధ్యాత్మిక ఉత్సవమని అన్నారు. జగన్నాథుడి రథయాత్రను ఏర్పాటు చేయడం పట్ల ఆయన నిర్వాహకులకు కృతజ్ఞతలు తెలిపారు. భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీక పటాన్ చెరు నియోజకవర్గమని తెలిపారు. దేశంలోని 27 రాష్ట్రాల ప్రజలు నియోజకవర్గంలో నివసిస్తున్నారని తెలిపారు. పటాన్ చెరు డివిజన్ పరిధిలోని బంగారుగడ్డ వద్ద మూడు ఎకరాల విస్తీర్ణంలో బాలాజీ, శ్రీకృష్ణుని దేవాలయాలు నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశామని తెలిపారు. భక్తులందరి సహాయ సహకారాలతో త్వరలోనే పనులు ప్రారంభిస్తామని తెలిపారు. భగవంతుడి కృపతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు శంకర్ యాదవ్, సపాన దేవ్, సీనియర్ నాయకులు గూడెం మధుసూదన్ రెడ్డి, మాజీ ఎంపీపీ యాదగిరి యాదవ్, ఏఎంసీ మాజీ చైర్మన్ విజయ్ కుమార్, నర్ర బిక్షపతి, పృథ్వీరాజ్, అశోక్, నర్సింలు, చంద్ర శేఖర్, మల్లేష్, ఉత్సవ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

Next Story