- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Home > జిల్లా వార్తలు > కరీంనగర్ > మహనీయుల విగ్రహాలకు ముసుగులు వేస్తే జైలుకే: ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్
మహనీయుల విగ్రహాలకు ముసుగులు వేస్తే జైలుకే: ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్
by Kodari Anjali |
విగ్రహాలకు ఉన్న ముసుగులను రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య స్థానిక దళిత సంఘాల నాయకులతో కలిసి తొలగించి ఆవిష్కరించారు.

X
దిశ, తిమ్మాపూర్: కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండల కేంద్రంలోని బాబా సాహెబ్ అంబేద్కర్, బాబు జగ్జీవన్ రాం విగ్రహాలకు ఉన్న ముసుగులను రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య స్థానిక దళిత సంఘాల నాయకులతో కలిసి తొలగించి ఆవిష్కరించారు. ఈ సందర్బంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మహనీయుల విగ్రహాల ఆవిష్కరణకు అనుమతి ఉన్నా కాలయాపన చేయడం తగదని భావించి ఈ రోజు ఆవిష్కరించానని అన్నారు. ఇకపై మళ్ళీ మహనీయుల విగ్రహాలకు ఎవరైనా ముసుగులు వేస్తె జైలుకు వెళ్ళక తప్పదని అన్నారు. రాజకీయాలు పార్టీల మధ్య ఉండాలి గాని రాజకీయాల్లోకి మహనీయులను తీసుకురావద్దని పేర్కొన్నారు. కార్యక్రమంలో దళిత సంఘాలు, అట పార్టీల నాయకులు వంతడుపుల సంపత్, బోయిని తిరుపతి, సుగుర్తి జగదీశ్వరా చారి తదితరులు పాల్గొన్నారు.
Next Story




