- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఏపీలో కరోనా కొత్తవేరియంట్.. లక్షణాలు ఇవే
ఏపీలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఇప్పటివరకు రాష్ట్రంలో 16 కేసులు నమోదయ్యాయి. నిన్నటివరకు కేసుల సంఖ్య 15ఉండగా విజయవాడకు చెందిన 13ఏళ్ల బాలిక సైతం కోవిడ్ బారిన పడటంతో సంఖ్య 16కు చేరింది.

దిశ, వెబ్ డెస్క్: ఏపీలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఇప్పటివరకు రాష్ట్రంలో 16 కేసులు నమోదయ్యాయి. నిన్నటివరకు కేసుల సంఖ్య 15ఉండగా విజయవాడకు చెందిన 13ఏళ్ల బాలిక సైతం కోవిడ్ బారిన పడటంతో సంఖ్య 16కు చేరింది. బాలికను వైద్యులు కోవిడ్ వార్డుకు తరలించారు. అంతేకాకుండా కరోనాతో ఏపీలో నలుగురు మరణించారు. కేసుల సంఖ్య పెరగటం, మరణాలు సైతం నమోదవ్వడంతో ప్రభుత్వం అప్రమత్తమై రోగుల శాంపిల్స్ ను జీనోమ్ సీక్వెన్సింగ్ టెస్టులకు పంపింది.
కాగా రాష్ట్రంలో నమోదవుతున్న కేసులు ఒమిక్రాన్ RF.5 వేరియంట్ గా నిర్ధారించారు. ఈ వేరియంట్ బారినపడినవాళ్లలో కనిపించే లక్షణాల గురించి వైద్యులు వెల్లడించారు. కొత్త వేరియంట్ సోకినవారిలో గొంతునొప్పి, దగ్గు, జ్వరం, తలనొప్పి, ముక్కు కారడం మరియు మూసుకుపోవడం, అలసట, ఒళ్లు నొప్పులు ఉంటాయని పేర్కొన్నారు. ఇది ప్రమాదకరమైన వేరియంట్ కాదని ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరంలేదని చెప్పారు. ఇక దేశవ్యాప్తంగా సైతం కేసులు పెరుగుతున్నాయి. జూలై 1 నుండి దేశంలో ఇప్పటి వరకు 340కి పైగా కేసులు నమోదయ్యాయి.






