రాజీ మార్గమే రాజమార్గం

by Ratna Kumari |

కోర్టు కేసుల పరిష్కారంలో రాజీ మార్గమే రాజమార్గం అని ఖమ్మం జిల్లా 6వ అదనపు జిల్లా జడ్జి మారగాని శ్రీనివాస్ అన్నారు.

రాజీ మార్గమే రాజమార్గం
X

దిశ, సత్తుపల్లి : కోర్టు కేసుల పరిష్కారంలో రాజీ మార్గమే రాజమార్గం అని ఖమ్మం జిల్లా 6వ అదనపు జిల్లా జడ్జి మారగాని శ్రీనివాస్ అన్నారు. శనివారం సత్తుపల్లి కోర్టు ఆవరణలో తెలంగాణ స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ, హైదరాబాద్ ఆదేశాల మేరకు నిర్వహించిన స్పెషల్ లోక్ అదాలత్ అవగాహన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ.. చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న కేసులను సామరస్యపూర్వకంగా పరిష్కరించుకునేందుకు స్పెషల్ లోక్ అదాలత్ మంచి అవకాశమని తెలిపారు. ముఖ్యంగా ఎన్‌ఐ యాక్ట్ (చెక్ బౌన్స్) కేసులు, ఎస్‌టీసీ, సీసీ, సెక్షన్ 138 ఎన్‌ఐ యాక్ట్ కేసులు పరస్పర అంగీకారంతో త్వరగా పరిష్కరించుకునేందుకు లోక్ అదాలత్ ఎంతో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. కక్షిదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని సమయం, ఖర్చు ఆదా చేసుకోవాలని సూచించారు.

మండల లీగల్ సర్వీసెస్ కమిటీ అందిస్తున్న సేవలను వివరిస్తూ, ఎస్సీ, ఎస్టీ, వెనుకబడిన వర్గాలకు చెందిన వారు ఉచిత న్యాయ సహాయం పొందేందుకు ఈ కమిటీని సంప్రదించవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల లీగల్ సర్వీసెస్ కమిటీ చైర్మన్, జిల్లా జడ్జి మారగాని శ్రీనివాస్, సీనియర్ సివిల్ జడ్జి ఎస్.కె. మేరా ఖాసిం సాహెబ్, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి బిఎస్ఎన్. సుమబాల, అదనపు జూనియర్ సివిల్ జడ్జి వి.లావణ్య, సత్తుపల్లి బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కె.రవి, న్యాయవాదులు, కోర్టు సిబ్బంది, కక్షిదారులు తదితరులు పాల్గొన్నారు.

Next Story