సుహాస్ ‘మండాడి’ తెలుగు హక్కులు సొంతం చేసుకున్న ప్రముఖ సంస్థ

by Chukka Sudharani |

‘కలర్ ఫొటో’ ఫేమ్ యంగ్ హీరో సుహాస్ ఇప్పుడు ‘మండాడి’ సినిమాతో కోలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే.

సుహాస్ ‘మండాడి’ తెలుగు హక్కులు సొంతం చేసుకున్న ప్రముఖ సంస్థ
X

దిశ, సినిమా: ‘కలర్ ఫొటో’ ఫేమ్ యంగ్ హీరో సుహాస్ ఇప్పుడు ‘మండాడి’ సినిమాతో కోలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే. మతిమారన్ పుగళేంది దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో కోలీవుడ్ నటుడు సూరి మరో ప్రధాన పాత్రలో నటిస్తుండగా.. మహిమా నంబియార్ హీరోయిన్‌గా, సీనియర్ నటుడు సత్యరాజ్, రవీంద్ర విజయ్, అచ్చుత్ కుమార్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. స్టార్ కంపోజర్ జీవీ ప్రకాష్ కుమార్ మ్యూజిక్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ మూవీ సెప్టెంబర్ 10న విడుదల కాబోతున్నది.

ఈ క్రమంలోనే తాజాగా మరో అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు మేకర్స్. ‘మండాడి’ తెలుగు థియేట్రికల్ రైట్స్‌ను ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ సొంతం చేసుకున్నట్లు తెలుపుతూ.. ‘ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ థియేట్రికల్ హక్కులను మైత్రీ మూవీ మేకర్స్ సొంతం చేసుకున్నారు.. ఈ అద్భుతమైన కలయికతో తెలుగు రాష్ట్రాల్లో ‘మండాడి’ ఉధృతిని అనుభవించండి’ అంటూ మరో సరికొత్త పోస్టర్‌ను షేర్ చేశారు. ఈ కలయికతో సినిమాపై హైప్ క్రియేట్ అయింది.

Next Story