జాతీయ విద్యార్థి పర్యావరణ పోటీల పోస్టర్ ఆవిష్కరించిన పాఠశాల విద్యా సంచాలకులు

by Ajay Maddhiboyina |

భారతదేశవ్యాప్తంగా జూలై 15 నుండి సెప్టెంబర్ 15, 2026 వరకు నిర్వహించబడుతున్న జాతీయ విద్యార్థి పర్యావరణ పోటీలకు సంబంధించిన పోస్టర్‌ను పాఠశాల విద్యా సంచాలకులు నవీన్ నికోలస్ ఆవిష్కరించారు.

జాతీయ విద్యార్థి పర్యావరణ పోటీల పోస్టర్ ఆవిష్కరించిన పాఠశాల విద్యా సంచాలకులు
X

దిశ, తెలంగాణ బ్యూరో: భారతదేశవ్యాప్తంగా జూలై 15 నుండి సెప్టెంబర్ 15, 2026 వరకు నిర్వహించబడుతున్న జాతీయ విద్యార్థి పర్యావరణ పోటీలకు సంబంధించిన పోస్టర్‌ను పాఠశాల విద్యా సంచాలకులు నవీన్ నికోలస్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, విద్యార్థుల్లో పర్యావరణ చైతన్యం, వాతావరణ బాధ్యత, సుస్థిర జీవన విధానాలు మరియు మిషన్ లైఫ్ సూత్రాలపై అవగాహన పెంపొందించేందుకు ఎన్ఎస్పీసీ-2026 ఒక గొప్ప జాతీయ కార్యక్రమమని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రం గతంలో ఈ పోటీలో విశేష విజయాలు సాధించిన నేపథ్యంలో ఈ సంవత్సరం కూడా రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, స్థానిక సంస్థలు, ఎయిడెడ్, ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొని తెలంగాణను దేశంలో అగ్రస్థానంలో నిలపాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రతి పాఠశాలలో ప్రతి తరగతి ఉపాధ్యాయుడిని ఎన్ఎస్పీసీ నోడల్ టీచర్ గా నియమించి, ‘ఎన్ఎస్పీసీ దినోత్సవం’ నిర్వహించడం ద్వారా విద్యార్థులందరూ ఆన్‌లైన్ క్విజ్‌లో పాల్గొనేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ నేషనల్ గ్రీన్ కార్ప్స్ సంచాలకులు/ఎన్ఎస్పీసీ 2026 జాతీయ సహ-సమన్వయకర్త డా. డబ్ల్యూ. జి. ప్రసన్న కుమార్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి పాఠశాల విద్యా శాఖ అందిస్తున్న సహకారానికి నవీన్ నికోలస్ కు ప్రసన్న కుమార్ కృతజ్ఞతలు తెలిపారు.

Next Story