- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వచ్చే వేసవి నాటికి తాగునీటి సమస్య లేకుండా చూస్తా: ఎంపీ ఈటల రాజేందర్
వచ్చే వేసవి కాలానికి ముందే అవసరమైన చర్యలు చేపట్టేందుకు తన వంతు సహకారం అందిస్తానని మల్కాజిగిరి ఎంపీ ఈటెల రాజేందర్ హామీ ఇచ్చారు.

దిశ, చైతన్యపురి: నాగోల్ డివిజన్ ప్రజలకు తాగునీటి ఇబ్బందులు లేకుండా వచ్చే వేసవి కాలానికి ముందే అవసరమైన చర్యలు చేపట్టేందుకు తన వంతు సహకారం అందిస్తానని మల్కాజిగిరి ఎంపీ ఈటెల రాజేందర్ హామీ ఇచ్చారు. నాగోల్ డివిజన్ ప్రజలు ఎన్నో ఏండ్లుగా ఎదుర్కొంటున్న తాగునీటి సమస్యలకు శాశ్వత పరిష్కారం కల్పించాలని కోరుతూ శనివారం నాగోల్ డివిజన్ పరిధిలోని రాక్ టౌన్ పార్క్ వద్ద కాలనీ సంక్షేమ సంఘాల ప్రతినిధులు, మహిళలు, ప్రజలతో కలిసి నాగోల్ డివిజన్ తాజా మాజీ కార్పొరేటర్ చింతల అరుణ సురేందర్ యాదవ్ సమావేశం నిర్వహించారు. నాగోల్ డివిజన్‌లోని పలు కాలనీల్లో నెలకొన్న తీవ్రమైన తాగునీటి సమస్యలను ప్రజలు ఎంపీ దృష్టికి తీసుకువెళ్లారు. ముఖ్యంగా హెచ్‌ఎండబ్ల్యూఎస్‌ఎస్‌బీ ద్వారా సరఫరా అవుతున్న తాగునీరు సరిపడా ఒత్తిడితో అందకపోవడం వల్ల వేలాది కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయని వివరించారు.
భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకొని..
వాటర్ సప్లై వచ్చే రోజుల్లో కూడా చాలా తక్కువ ఒత్తిడితో నీరు రావడం వల్ల ప్రజలకు అవసరమైనంత నీరు అందడం లేదన్నారు. ఎత్తైన ప్రాంతాల్లో నివసించే కుటుంబాలకు అసలు నీరు చేరకపోవడం వల్ల మహిళలు, వృద్ధులు, చిన్నారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ఈ సమస్యపై పలుమార్లు వాటర్ బోర్డు అధికారులకు వినతులు అందజేసినా అధికారుల నుంచి తాత్కాలిక చర్యలు తప్ప శాశ్వత పరిష్కారం లభించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకొని సుమారు 2 లక్షల లీటర్ల సామర్థ్యం గల ఆధునిక ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్‌ను అత్యవసరంగా నిర్మించాలని ఎంపీని కోరారు. స్పందించిన ఎంపీ ఈటెల రాజేందర్ ప్రజల సమస్యలను పూర్తిగా విని, హెచ్‌ఎండబ్ల్యూఎస్‌ఎస్‌బీ ఉన్నతాధికారులతో ప్రత్యేకంగా మాట్లాడి సమస్యకు శాశ్వత పరిష్కారం దిశగా చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో పలు కాలనీల సంక్షేమ సంఘాల ప్రతినిధులు, మహిళలు, యువకులు, ప్రజాప్రతినిధులు, బీజేపీ నాయకులు పాల్గొన్నారు.






