మంచినీటి పైప్ లైన్‌లో డ్రైనేజీ సరఫరా...

by Kodari Anjali |

మంచినీటి పైప్ లైన్ లో డ్రైనేజీ వాటర్ సరఫరా అవుతుందని ఫిర్యాదు చేసిన సంబంధిత అధికారులు పట్టించుకోవడంలేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

మంచినీటి పైప్ లైన్‌లో డ్రైనేజీ సరఫరా...
X

దిశ, కార్వాన్: మంచినీటి పైప్ లైన్ లో డ్రైనేజీ వాటర్ సరఫరా అవుతుందని ఫిర్యాదు చేసిన సంబంధిత అధికారులు పట్టించుకోవడంలేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. లంగర్ హౌస్ బాపునగర్ సాయిబాబా టెంపుల్ ప్రాంతంలో మంచినీటి సరఫరా లో డ్రైనేజీ వాటర్ గత వారం రోజులుగా సరఫరా అవుతుందని స్థానిక ప్రజలు పేర్కొన్నారు. డ్రైనేజీ వాటర్ వస్తుందని సంబంధిత వాటర్ వర్క్స్ మేనేజర్ కు ఫిర్యాదు చేశామని స్థానికులు పేర్కొన్నారు. అయితే తాము చేసేది ఏమీ లేదని, ముందుగా 15 ఫిర్యాదులు ఉన్నాయని ఆ ఫిర్యాదులు అయిపోయిన తర్వాత తమ ఫిర్యాదును పట్టించుకుంటామని మేనేజర్ సాయి రెడ్డి తెలిపారని స్థానిక వినియోగదారుడు విజయ్ కుమార్ తెలిపారు. అయితే తమ ప్రాంతంలో మంచినీటి సరఫరా పైప్ లైన్ లో డ్రైనేజీ వాటర్ రావడంతో చిన్న పిల్లలు తీవ్ర అనారోగ్య పాలవుతున్నారని ఆరోపిస్తున్నారు. వెంటనే సంబంధిత ఉన్నతాధికారులు పట్టించుకోని తమ ప్రాంతంలో జలమండలి కి చెందిన మంచినీటి సరఫరా పైప్ లైన్‌లో డ్రైనేజీ వాటర్ రాకుండా చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.

Next Story