- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నర్సాపూర్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి రాజిరెడ్డి మాకొద్దు
నర్సాపూర్ కాంగ్రెస్ ఇంచార్జి ఆవుల రాజిరెడ్డి మమ్మల్ని పట్టించుకోవడం లేదని శివంపేట మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు శనివారం గాంధీ భవన్ లో ఫిర్యాదు చేశారు.

"కారు" కాంగ్రెస్ పార్టీ నాయకులకే ప్రాధాన్యతపై ఆగ్రహం.
కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేనప్పుడు పార్టీ కార్యక్రమాలు,పార్టీ బలోపేతానికి శత విధాల శ్రమించి అప్పటి అధికార పార్టీతో ఢీకొన్ని అష్టకష్టాలు పడ్డామని మండల పార్టీ అధ్యక్షులు సుదర్శన్ గౌడ్ ఆవేదన వ్యక్తం చేశారు. పదేండ్లు కేసీఆర్ ప్రభుత్వంలో ఉండి అధికారాన్ని అనుభవించి, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే కారు పార్టీలో నుంచి వచ్చిన కాంగ్రెస్ పార్టీ నాయకులకే ఇంచార్జి ఆవుల రాజిరెడ్డి ప్రాధాన్యత ఇవ్వడమెంటనీ ఆయన మండిపడ్డారు. గత అసెంబ్లీ ఎన్నికలలో రాజిరెడ్డి పోటీ చేస్తే గులాబీ పార్టీ అభ్యర్థికి ఓటేసిన ప్రస్తుత కాంగ్రెస్ నాయకులను వెంటేసుకొని తిరగడం సిగ్గుచేటని ఆయన ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీలో కష్టపడి పనిచేస్తున్న సీనియర్ నాయకులను పక్కన పెట్టి, మండల పార్టీ అధ్యక్షులకు సమాచారం ఇవ్వకుండా గ్రామాలలో రాజిరెడ్డి కార్యక్రమాలను చేపట్టడమెంటని ఆయన దుయ్యబట్టారు. ఆవుల రాజిరెడ్డి వ్యవహార శైలి నచ్చక కొంత మంది సీనియర్లు పార్టీకి దూరంగా ఉండే దౌర్భాగ్యము వచ్చిందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. మాజీ మంత్రి సునీతారెడ్డి పార్టీని విడిచి వెళ్లిన గాని మండలంలో కాంగ్రెస్ పార్టీని కాపాడింది మేమని,ఇప్పుడున్న ఇంచార్జి ఆవుల రాజిరెడ్డి కాదని ఆయన మండిపడ్డారు.ఇప్పటికైనా అధిష్టానం పునరాలోచించి నర్సాపూర్ పార్టీ బలోపేతం కోసం పార్టీ ఇంచార్జి రాజిరెడ్డిని మార్చాల్సిందేనని ఆయన డిమాండ్ చేశారు.చెంది నరా గౌడ్, బాసంపల్లి శ్రీనివాస్ గౌడ్, మన్నె నర్సింలు, దొంతి వెంకట్ రెడ్డి, కొడకాంచి శ్రీనివాస్ గౌడ్, చెన్నాపూర్ రవీందర్ యాదవ్, అల్లిపూర్ శ్రీనివాస్, కందికొండ అశోక్, తిరుపతి రాథోడ్, పాండ్యా నాయక్, ప్రహ్లాద్ చారి, కృష్ణ ,రాములు తదితరులు పాల్గొన్నారు.






