- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తెలంగాణ యువతను కేటీఆర్ తప్పుదోవ పట్టిస్తున్నారు: చామల కిరణ్ కుమార్ రెడ్డి
కేసీఆర్ చేసిన తప్పులను ఒప్పుకుని భవిష్యత్తులో తానే నాయకుడిని అని కేటీఆర్ చెప్పుకుంటున్నారని, తెలంగాణ యువతను ఆయన తప్పుదోవ పట్టిస్తున్నారని భువనగిరి ఎంపీ, చామల కిరణ్ కుమార్ రెడ్డి మండిపడ్డారు.

దిశ, తెలంగాణ బ్యూరో : కేసీఆర్ చేసిన తప్పులను ఒప్పుకుని భవిష్యత్తులో తానే నాయకుడిని అని కేటీఆర్ చెప్పుకుంటున్నారని, తెలంగాణ యువతను ఆయన తప్పుదోవ పట్టిస్తున్నారని భువనగిరి ఎంపీ, చామల కిరణ్ కుమార్ రెడ్డి మండిపడ్డారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ మేక తోలు కప్పుకున్న తోడేలులా కేటీఆర్ వ్యవహారం ఉందని, మీ పదేళ్లలో నీళ్లు, నిధులు, నియామకాలు ఎటు పోయాయని ఆయన ప్రశ్నించారు. కేసీఆర్ సీఎంగా ఉంటే పేపర్ లీకేజీ అయితే తామే పట్టుకున్నామని కేటీఆర్ గొప్పలు చెప్తున్నారని, వారి హయాంలో పేపర్ లీకేజ్ అయితే కేటీఆర్ విద్యార్థుల పట్ల అవహేళన గా మాట్లాడలేదా? అని ఎంపీ చామల నిలదీశారు. కేసీఆర్ కుటుంబంలో ఎంత మందికి ఉద్యోగాలు వచ్చాయి, రేవంత్ రెడ్డి ఇంట్లో ఎవరికి అయినా ఉద్యోగాలు వచ్చాయా? అని ఆయన ప్రశ్నించారు. 2009లో ఉద్యమకారుడు కేకే మహేందర్ రెడ్డిని కాదని సిరిసిల్ల టిక్కెట్ కేటీఆర్ కు కేసీఆర్ ఇచ్చారని, త కొడుకు, బిడ్డ రాజకీయాల్లోకి రారని కేసీఆర్ చెప్పారని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఆరోపించారు.
కేటీఆర్ కె.కె.మహేందర్ రెడ్డి కడుపు కొట్టి ఎమ్మెల్యే, మంత్రి అయ్యారని, హరీశ్ రావు ఎమ్మెల్యే కాకముందే మంత్రి అయ్యారు, కవితకు లోక్ సభ టికెట్ ఇచ్చారని, రెండవ సారి ఓడిపోతే ఎమ్మెల్సీ ఇచ్చారని ఎంపీ చామల విమర్శించారు. సంతోశ్ రావుకు రాజ్యసభ ఎంపీ ఇచ్చారని, గొప్పలు మాట్లాడుతున్న కేటీఆర్ దీనికి సమాధానం చెప్పాలని ఆయన నిలదీశారు. తనకు ప్రధాన ప్రతిపక్ష హోదా కావాలని మీ నాన్నను అడుగు కేటీఆర్ అని ఎంపీ చామల అన్నారు. నిధులు దోచుకుని దాచుకున్న డబ్బుతో సభలు పెడుతున్నారని, హైదరాబాద్ చుట్టూ ఫామ్ హౌస్ లు కట్టుకున్నారని, సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ ఏర్పాటు చేసుకున్నారని కిరణ్ కుమార్ రెడ్డి చెప్పారు. కేటిఆర్ పిచ్చి మాటలు బంద్ చేయాలని, రేవంత్ రెడ్డిని, రాహుల్ గాంధీని, సోనియాగాంధీని, ప్రియాంక గాంధీని తిడితే ఆయన హీరో కాలేరని ఎంపీ చామల మండిపడ్డారు. పరేడ్ గ్రౌండ్ లో 67 వేల మంది ఉద్యోగులను నిలబెడతాము వచ్చి లెక్కబెట్టుకో కేటీఆర్ అని సవాల్ విసిరారు. రేపే ఎన్నికలు వస్తాయని కేటీఆర్ పగటి కలలు కని 78 సీట్లు అంటున్నారని, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో జబ్బలు చరుచుకుంటే ఏమైంది కేటీఆర్ అని ఎంపీ చామల నిలదీశారు.






