గుర్తుతెలియని వాహనం ఢీకొని ఓ వ్యక్తి మృతి

by Taduka Kalyani |

గుర్తుతెలియని వాహనం ఢీకొట్టడంతో ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం తెల్లవారుజామున జరిగింది.

గుర్తుతెలియని వాహనం ఢీకొని ఓ వ్యక్తి మృతి
X

దిశ, రాజేంద్రనగర్ : గుర్తుతెలియని వాహనం ఢీకొట్టడంతో ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం తెల్లవారుజామున జరిగింది. రాఘవేందర్ తెలిపిన వివరాల ప్రకారం.. అల్లాపూర్ లో నివాసం ఉండే సూర్య ప్రకాష్ (30) కారు డ్రైవర్ గా పని చేస్తున్నాడు. ఈనెల 17వ తేదీన సాయంత్రం పనిలో భాగంగా ఇంటి నుంచి బయటకు వెళ్లాడు. రాత్రి 8 గంటలకు భార్యకు ఫోన్ చేసి తను రావడానికి లేట్ అవుతుందని చెప్పి ఫోన్ పెట్టేసాడు. శనివారం ఉదయం రెండు గంటల ప్రాంతంలో ఓ ఆర్ ఆర్ ఎగ్జిట్ నెంబర్ 17 వద్ద గుర్తుతెలియని వాహనం సూర్యప్రకాష్ ను ఢీకొట్టడంతో తలకు తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. ఓ ఆర్ ఆర్ సిబ్బంది ఇచ్చిన సమాచారం మేరకు ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేస్తున్నారు. శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. సూర్య ప్రకాష్ భార్య నాగలక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Next Story