- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పురుమల్ల శ్రీనివాస్‌పై సస్పెన్షన్ ఎత్తివేత..
by Kodari Anjali |
పురుమల్ల శ్రీనివాస్‌పై సస్పెన్షన్ ఎత్తివేస్తూ తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ కమిటీ ఛైర్మెన్ మల్లు రవి శనివారం ఉత్తర్వులు జారీ చేశారు.

X
దిశ, కరీంనగర్ రూరల్: పురుమల్ల శ్రీనివాస్‌పై సస్పెన్షన్ ఎత్తివేస్తూ తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ కమిటీ ఛైర్మెన్ మల్లు రవి శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన పురుమల్ల శ్రీనివాస్ పార్టీ పట్ల వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారనే ఆరోపణలతో గత కొంతకాలంగా సస్పెన్షన్ ఎదుర్కున్నారు. పార్టీ సీనియర్ నాయకులపై నిరాధారమైన ఆరోపణలు, అనవసరమైన ప్రకటనలు చేయడం మానుకోవాలని పురుమల్లకు లేఖ ద్వారా సూచించారు. ఇది ఇలా ఉండగా కరీంనగర్ సూడా చైర్మెన్ సీటు కొరకై వాడివేడిగా చర్చలు జరుగుతున్న నేపథ్యంలో పురుమల్లపై సస్పెన్షన్ ఎత్తివేయడం కరీంనగర్ నియోజకవర్గాలలో చర్చనీయాంశంగా మారింది.
Next Story






