ఓటీటీ రిలీజ్‌కు సిద్ధమైన ‘బాలన్ ది బాయ్’

by Chukka Sudharani |

‘మంజుమ్మెల్ బాయ్స్’ మలయాళ సినిమాతో ఇండియా వైడ్‌గా గుర్తింపు తెచ్చుకున్న డైరెక్టర్ చిదంబరం తెరకెక్కించిన సరికొత్త సినిమా ‘బాలన్ ది బాయ్’.

ఓటీటీ రిలీజ్‌కు సిద్ధమైన ‘బాలన్ ది బాయ్’
X

దిశ, సినిమా: ‘మంజుమ్మెల్ బాయ్స్’ మలయాళ సినిమాతో ఇండియా వైడ్‌గా గుర్తింపు తెచ్చుకున్న డైరెక్టర్ చిదంబరం తెరకెక్కించిన సరికొత్త సినిమా ‘బాలన్ ది బాయ్’. కేవీఎన్ ప్రొడక్షన్స్ తెస్పియన్ ఫిలింస్ సంస్థలు సంయుక్తంగా ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని నిర్మించాయి. మనందరికీ బాగా కనెక్ట్ అయ్యే ఒక చక్కటి నేటివిటీ కథతో, అలాగే ప్రతి ఒక్కరి మనసును హత్తుకునే బలమైన సెంటిమెంట్, భావోద్వేగాలతో రూపొందిన ఈ మూవీ ఈ ఏడాది జూన్ 19న తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా విడుదలై బిగ్గెస్ట్ హిట్ అందుకుంది. చిన్న సినిమాగా వచ్చిన ఈ మూవీ అత్యధిక ప్రేక్షకాదారణ పొంది సూపర్ సక్సెస్ అందుకుంది. ఇప్పుడు ఈ మూవీ ఓటీటీ రిలీజ్‌కు సిద్ధం అయింది. బాలన్ ది బాయ్ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ Zee5 సొంతం చేసుకోగా.. జులై 31 నుండి మలయాళం, తమిళం, తెలుగు & కన్నడలో ప్రసారం కాబోతున్నట్లు అఫీషియల్‌గా ప్రకటించింది.

Next Story