CWG 2026 : కామన్వెల్త్ గేమ్స్‌లో ఫ్లాగ్ బేరర్స్‌గా మీరాబాయి చాను, లవ్లీనా బోర్గోహైన్

by Harish |

భారత దిగ్గజ వెయిట్‌లిఫ్టర్ మీరాబాయి చాను, మహిళా బాక్సర్ లవ్లీనా బోర్గోహైన్‌‌లకు గొప్ప గౌరవం దక్కింది.

CWG 2026 : కామన్వెల్త్ గేమ్స్‌లో ఫ్లాగ్ బేరర్స్‌గా మీరాబాయి చాను, లవ్లీనా బోర్గోహైన్
X

దిశ, స్పోర్ట్స్ : భారత దిగ్గజ వెయిట్‌లిఫ్టర్ మీరాబాయి చాను, మహిళా బాక్సర్ లవ్లీనా బోర్గోహైన్‌‌లకు గొప్ప గౌరవం దక్కింది. కామన్వెల్త్ గేమ్స్ ప్రారంభోత్సవంలో వీరిద్దరూ భారత ఫ్లాగ్ బేరర్స్‌గా ఎంపికయ్యారు. కామన్వెల్త్ గేమ్స్‌లో భారత్ నుంచి వివిధ క్రీడల్లో మొత్తం 124 మంది అథ్టెట్లు పాల్గొంటున్నారు. ఓపెనింగ్ సెర్మనీలో భారత బృందానికి మీరాబాయి చాను, లవ్లీనా బోర్గోహైన్ నాయకత్వం వహించనున్నారు. భారత ఒలింపిక్ అసోసియేషన్(ఐవోఏ) శనివారం ఈ విషయాన్ని వెల్లడించింది. ఐవోఏ ప్రెసిడెంట్ పీటీ ఉష మాట్లాడుతూ.. మీరాబాను, లవ్లీనా భారత క్రీడ రంగానికి చేసిన అద్భుతమైన సేవలకు ఇది నిదర్శనమన్నారు. ‘మీరాబాయి, లవ్లీనా ప్రారంభోత్సవాన్ని నిర్వహించడం గర్వకారణంగా ఉంది. వారిద్దరూ అంతర్జాతీయ వేదికపై ఎన్నోసార్లు తమను తాము నిరూపించుకున్నారు. ఇప్పుడు కూడా ఇంగ్లాండ్‌లో కామన్వెల్ గేమ్స్ కోసం శిక్షణ పొందుతున్నారు.’అని ఉష తెలిపారు. స్కాట్లాండ్‌లోని గ్లాస్కోలో కామన్వెల్త్ క్రీడలు జరగనున్నాయి. ఈ నెల 23న ఓపెనింగ్ సెర్మనీ జరగనుంది. ఈ ప్రారంభ వేడుకల్లో మీరాబాయి, లవ్లీనా జాతీయ జెండా చేతబూని భారత బృందాన్ని నడిపించనున్నారు.


Next Story