- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Hyd: పవన్ కల్యాణ్‌ను పరామర్శించిన లోకేశ్
ముంబయిలో కుడి భుజానికి శస్త్రచికిత్స చేయించుకుని విజయవంతంగా డిశ్చార్జ్ అయిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ను మంత్రి నారా లోకేశ్ పరామర్శించారు...

దిశ, వెబ్ డెస్క్: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్(AP Deputy CM Pawan Kalyan) ఇటీవల ముంబయి(Mumbai)లో కుడి భుజానికి శస్త్రచికిత్స చేయించుకుని విజయవంతంగా డిశ్చార్జ్ అయిన విషయం తెలిసిందే. అయితే ఆయన ప్రస్తుతం హైదరాబాద్‌లోని తన నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్నారు. దీంతో పవన్ కల్యాణ్‌ను పలువురు ప్రముఖులు, రాజకీయ నేతలు పరామర్శిస్తున్నారు. శస్త్రచికిత్స తర్వాత ఆరోగ్యం, వైద్య సంరక్షణపై అడిగి తెలుసుకుంటున్నారు.
మంత్రి నారా లోకేశ్ సైతం...
తాజాగా పవన్ కల్యాణ్‌ను సహచర మంత్రి నారా లోకేశ్(Minister Nara Lokesh) సైతం పరామర్శించారు. త్వరగా, సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకోవాలని సూచించారు. మళ్లీ పూర్తి ఉత్సాహంతో ప్రజల ముందుకు రావాలని, వైద్యుల సూచనలు, సలహాలు పాటించాలని చెప్పారు. వీలైనంత వరకు విశ్రాంతి తీసుకోవాలని తెలిపారు. రాజకీయ, అధికారిక కార్యక్రమాలకు కొంతకాలం దూరంగా ఉండి అయినా సరే ఆరోగ్యంపైనే పూర్తి శ్రద్ధ పెట్టాలని పవన్ కల్యాణ్‌కు లోకేశ్ సూచించారు.






