- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మహిళతో హోం స్టే గదిలోకి వెళ్లిన కానిస్టేబుల్.. అనుమానం వచ్చి...!
తిరుపతి జిల్లా పాకాల పరిధి చింతలచేను ప్రాంతంలో నకిలీ కానిస్టేబుల్ హల్‌చల్ చేశాడు. పోలీస్ యూనిఫాం ధరించి, నకిలీ గుర్తింపు కార్డు చూపించి ఒక హోమ్ స్టే మేనేజర్‌ను బెదిరింపులకు గురిచేశారు. .

దిశ, వెబ్ డెస్క్: తిరుపతి జిల్లా(Tirupati District) పాకాల(Pakala) పరిధి చింతలచేను ప్రాంతంలో నకిలీ కానిస్టేబుల్(Fake Constable) హల్‌చల్ చేశాడు. పోలీస్ యూనిఫాం ధరించి, నకిలీ గుర్తింపు కార్డు చూపించి ఒక హోమ్ స్టే మేనేజర్‌ను బెదిరింపులకు గురిచేశారు. శనివారం తెల్లవారుజామున సుమారు 3 గంటల సమయంలో ఒక మహిళతో కలిసి సదరు వ్యక్తి ఆ హోమ్ స్టేలో గదిని అద్దెకు తీసుకున్నాడు. అయితే ఉదయం 6 గంటలవుతున్నా గది తలుపులు ఎంతకీ తెరవకపోవడంతో హోమ్ స్టే సిబ్బందికి అనుమానం వచ్చింది. దీంతో వారు వెంటనే అలిపిరి పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సదరు వ్యక్తిని విచారించారు. అయితే అతను నకిలీ పోలీస్ అని తేలింది. నిందితుడు గుంటూరుకు చెందిన దాసరి కార్తీక్‌గా పోలీసులు గుర్తించారు. అతని వద్ద ఉన్న నకిలీ పోలీస్ ఐడీ కార్డుతో పాటు కానిస్టేబుల్ యూనిఫాంను స్వాధీనం చేసుకున్నారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.






