కరీంనగర్ కార్పొరేషన్‌లో సిటీ బస్సులు నడపాలని మంత్రి పొన్నం ప్రభాకర్‌కు వినతిపత్రం

by Kodari Anjali |

మంత్రి పొన్నం ప్రభాకర్ ను కరీంనగర్ కార్పొరేషన్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు & కార్పొరేటర్ వైద్యుల అంజన్ కుమార్ తదితరులతో కలిసి వినతిపత్రం అందజేశారు.

కరీంనగర్ కార్పొరేషన్‌లో సిటీ బస్సులు నడపాలని మంత్రి పొన్నం ప్రభాకర్‌కు వినతిపత్రం
X

దిశ, కరీంనగర్ కలెక్టరేట్: కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలో ప్రజా రవాణా సౌకర్యాన్ని మెరుగుపరిచేందుకు గాను ఈరోజు హైదరాబాద్ సెక్రటేరియట్‌లో రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ను కరీంనగర్ కార్పొరేషన్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు & కార్పొరేటర్ వైద్యుల అంజన్ కుమార్ తదితరులతో కలిసి వినతిపత్రం అందజేశారు. వినతిపత్రంలో కరీంనగర్ నగరం దినదినాభివృద్ధి చెందుతుందని, ప్రస్తుతం 6 లక్షల జనాభా కలిగిన కార్పొరేషన్ పరిధిలో 3 వైద్య కళాశాలలు, ఒక శాతవాహన విశ్వవిద్యాలయం ఉన్నాయని, ఇటీవల 14 గ్రామాలు విలీనం అయ్యాయని పేర్కొన్నాం.విద్యార్థులు, రోగులు, ఉద్యోగులు, సామాన్య ప్రజలు ప్రభుత్వ బస్సు సౌకర్యం లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ప్రైవేట్ వాహనాలపై ఆధారపడటం వల్ల ఆర్థిక భారం పడుతుందని మంత్రి దృష్టికి తీసుకువచ్చాం. కావున కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలో సిటీ బస్సు సర్వీసులను మంజూరు చేయాలని కోరమన్నారు . ముఖ్యంగా విద్యార్థులకు, పేద ప్రజలకు ఎంతో ఉపయోగపడుతుందని తెలిపామన్నారు. ఈ విషయంపై మంత్రి సానుకూలంగా స్పందించి అధికారులతో మాట్లాడి త్వరలో నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారన్నారు. ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ సాయిని తిరుపతి, మండల కాంగ్రెస్ అధ్యక్షులు కామిరెడ్డి రామ్ రెడ్డి గారు పెంట శేఖర్ పాల్గొన్నారు.

Next Story