- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అమరావతి రైతులకు గుడ్ న్యూస్.. రిటర్నబుల్ ప్లాట్ల కేటాయింపు
రాజధాని అమరావతి నిర్మాణానికి భూములు ఇచ్చిన రైతులకు ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (ఏపీ సీఆర్డీఏ) శనివారం రిటర్నబుల్ ప్లాట్లను ఈ-లాటరీ విధానంలో కేటాయించింది....

దిశ, ఏపీ బ్యూరో: రాజధాని అమరావతి నిర్మాణానికి భూములు ఇచ్చిన రైతులకు ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (ఏపీ సీఆర్డీఏ) శనివారం రిటర్నబుల్ ప్లాట్లను ఈ-లాటరీ విధానంలో కేటాయించింది. రాయపూడిలోని సీఆర్డీఏ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో అడిషనల్ కమిషనర్ కొల్లాబత్తుల కార్తీక్ రైతులకు ప్రొవిజనల్ సర్టిఫికెట్లు అందజేశారు.
నాలుగు గ్రామాల రైతులకు లబ్ధి
ల్యాండ్ పూలింగ్ స్కీమ్ (ఎల్పీఎస్) కింద భూములు ఇచ్చిన నవులూరు, కృష్ణాయపాలెం, పెనుమాక, కురగల్లు గ్రామాలకు చెందిన 33 మంది రైతులకు మొత్తం 76 రిటర్నబుల్ ప్లాట్లను కేటాయించారు. వీటిలో 46 నివాస (రెసిడెన్షియల్), 30 వాణిజ్య (కమర్షియల్) ప్లాట్లు ఉన్నాయి.
పారదర్శకంగా ఈ-లాటరీ
రైతుల సమక్షంలో ఆన్‌లైన్ ర్యాండమ్ సిస్టమ్ ద్వారా ముందుగా ట్రయల్ రన్ నిర్వహించి, అనంతరం ప్రత్యక్ష ఈ-లాటరీ ప్రక్రియ చేపట్టారు. పూర్తి పారదర్శకంగా ప్లాట్ల కేటాయింపు నిర్వహించినట్లు అధికారులు తెలిపారు.
త్వరగా రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకోవాలి
ప్లాట్లు పొందిన రైతులు రిజిస్ట్రేషన్ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేసుకోవాలని అడిషనల్ కమిషనర్ కార్తీక్ సూచించారు. రైతులకు కేటాయించిన ప్లాట్ల స్థానాలను జీఐఎస్ సిబ్బంది, గ్రామ సర్వేయర్లు చూపించి అవసరమైన సహకారం అందిస్తారని తెలిపారు.




