మద్యం తాగి వేధింపులు.. చివరికి మృతి

by Kodari Anjali |

రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ గ్రామంలోని కేఎస్ఆర్ నగర్ డబుల్ బెడ్‌రూమ్ కాలనీలో కుటుంబ కలహాలు విషాదానికి దారితీశాయి.

మద్యం తాగి వేధింపులు.. చివరికి మృతి
X

దిశ, ముస్తాబాద్: రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ గ్రామంలోని కేఎస్ఆర్ నగర్ డబుల్ బెడ్‌రూమ్ కాలనీలో కుటుంబ కలహాలు విషాదానికి దారితీశాయి. పోలీసుల వివరాల ప్రకారం.. మహమ్మద్ షాదుల్ అనే వ్యక్తి ప్రతిరోజూ మద్యం సేవించి ఇంటికి వచ్చి భార్య హఫీజా, కుమారుడు అస్రఫిన్‌ను వేధించేవాడు. ఈ వేధింపులు భరించలేక ఇద్దరూ అతడిని హత్య చేయాలని నిర్ణయించుకున్నట్లు దర్యాప్తులో వెల్లడైంది.ఈ నెల 16వ తేదీ మధ్యాహ్నం సుమారు 1.30 గంటల సమయంలో షాదుల్ మద్యం సేవించి ఇంటికి రాగా, ముందుగా వేసుకున్న ప్రణాళిక ప్రకారం కుమారుడు అస్రఫిన్ క్రికెట్ బ్యాట్‌తో, భార్య హఫీజా వైపర్ ఐరన్ పైప్‌తో షాదుల్ మెడ, వీపుపై బలంగా దాడి చేసినట్లు పోలీసులు తెలిపారు. తీవ్రంగా గాయపడిన షాదుల్‌ను హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ జూలై 17 రాత్రి 11.30 గంటలకు మృతి చెందినట్లు సమాచారం. ముస్తాబాద్ గ్రామ పంచాయతీ కార్యదర్శి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. దర్యాప్తులో భాగంగా సిరిసిల్ల రూరల్ సీఐ, ముస్తాబాద్ ఎస్‌ఐ సంఘటనా స్థలాన్ని సందర్శించి ఆధారాలు సేకరించారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలపై పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు.

Next Story