- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కంగ్టి రైతు వేదికలో దొంగతనం..
by Taduka Kalyani |
కంగ్టి మండల కేంద్రంలోని రైతు వేదికలో గుర్తు తెలియని దుండగులు చోరీకి పాల్పడ్డారు. రైతు వేదికలో ఉన్న ఒక బ్యాటరీ, ఒక ఇన్వర్టర్‌ను దొంగలు అపహరించారు.

X
దిశ, కంగ్టి: కంగ్టి మండల కేంద్రంలోని రైతు వేదికలో గుర్తు తెలియని దుండగులు చోరీకి పాల్పడ్డారు. రైతు వేదికలో ఉన్న ఒక బ్యాటరీ, ఒక ఇన్వర్టర్‌ను దొంగలు అపహరించారు. వీటి విలువ సుమారు రూ.15 వేల వరకు ఉంటుందని అధికారులు తెలిపారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వ్యవసాయ శాఖ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. రైతు వేదికకు ఉన్న తాళాలను రెండు రోజులుగా తెరవడానికి ప్రయత్నించినప్పటికీ అవి తెరుచుకోలేదు. దీంతో శుక్రవారం తాళాలు పగులగొట్టి లోపలికి వెళ్లి పరిశీలించగా ఒక బ్యాటరీ, ఒక ఇన్వర్టర్ కనిపించకపోవడంతో దొంగతనం జరిగినట్లు గుర్తించారు. ఈ ఘటనపై వ్యవసాయ విస్తరణ అధికారి శ్వేత కంగ్టి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు మేరకు ఎస్సై దుర్గారెడ్డి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Next Story






