వ్యవసాయ బోరు బావుల నుంచి కేబుల్ వైర్ల చోరీ

by Ratna Kumari |

కామారెడ్డి జిల్లా దేవునిపల్లి రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఇల్చిపూర్ గ్రామ శివారులో వ్యవసాయ బోరు బావుల నుంచి కేబుల్ వైర్లు చోరీకి గురైన ఘటన శనివారం వెలుగులోకి వచ్చింది.

వ్యవసాయ బోరు బావుల నుంచి కేబుల్ వైర్ల చోరీ
X

దిశ, కామారెడ్డి రూరల్ : కామారెడ్డి జిల్లా దేవునిపల్లి రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఇల్చిపూర్ గ్రామ శివారులో వ్యవసాయ బోరు బావుల నుంచి కేబుల్ వైర్లు చోరీకి గురైన ఘటన శనివారం వెలుగులోకి వచ్చింది. గ్రామ శివారులోని నల్లకుంట మైసమ్మ ప్రాంతంలో ఉన్న సుమారు 8 మంది రైతుల వ్యవసాయ బోరు బావులను లక్ష్యంగా చేసుకున్న గుర్తుతెలియని దుండగులు, స్టార్టర్ బాక్సుల తాళాలు పగులగొట్టి ఫ్యూజ్‌లను ధ్వంసం చేసి, స్టార్టర్ బాక్స్ నుంచి బోరు బావుల వరకు ఉన్న కేబుల్ వైర్లను కోసుకుని ఎత్తుకెళ్లినట్లు బాధిత రైతులు తెలిపారు. ఈ ఘటనలో ఇల్చిపూర్ గ్రామానికి చెందిన పోతన్నగారి లింగం, శివ రాజయ్య, ఎడుదుల గంగాధర్, లింగం ఆకుల రాజు, ఆకుల శివధనం, ఒడ్డం పోచయ్య** తదితర రైతుల బోరు బావుల కేబుల్ వైర్లు చోరీకి గురైనట్లు వెల్లడించారు. ఈ ఘటనపై బాధిత రైతులు దేవునిపల్లి రూరల్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఘటనపై దర్యాప్తు చేపట్టారు.

Next Story