ఎల్లారెడ్డి ప్రభుత్వ జూనియర్ కళాశాల ఇన్‌చార్జి ప్రిన్సిపాల్ సస్పెన్షన్

by Ratna Kumari |

కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి ప్రభుత్వ జూనియర్ కళాశాల ఇన్‌చార్జి ప్రిన్సిపాల్ డాక్టర్ డి.నిజాంపై సస్పెన్షన్ వేటు పడింది.

ఎల్లారెడ్డి ప్రభుత్వ జూనియర్ కళాశాల ఇన్‌చార్జి ప్రిన్సిపాల్ సస్పెన్షన్
X

దిశ, లింగంపేట :కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి ప్రభుత్వ జూనియర్ కళాశాల ఇన్‌చార్జి ప్రిన్సిపాల్ డాక్టర్ డి.నిజాంపై సస్పెన్షన్ వేటు పడింది. కళాశాలలో పనిచేస్తున్న కొందరు సిబ్బంది పట్ల అసభ్యకరంగా ప్రవర్తించడం, వేధింపులకు గురిచేయడం, విధుల నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఆరోపణల నేపథ్యంలో ఇంటర్మీడియట్ బోర్డు రీజినల్ జాయింట్ డైరెక్టర్ (ఆర్‌జేడీ) అజ్మీరా గోపాల్ శుక్రవారం రాత్రి సస్పెన్షన్ ఉత్తర్వులు జారీ చేశారు.

ఇన్‌చార్జి ప్రిన్సిపాల్‌పై పలువురు సిబ్బంది ఫిర్యాదు చేయడంతో ఇంటర్మీడియట్ బోర్డు కామారెడ్డి జిల్లా నోడల్ అధికారి షేక్ సలాం విచారణ చేపట్టి తన నివేదికను ఆర్‌జేడీకి సమర్పించారు. నివేదిక ఆధారంగా సస్పెన్షన్ చర్యలు తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. సస్పెన్షన్ కాలంలో డాక్టర్ డి.నిజాం ప్రధాన కార్యాలయం (హెడ్‌క్వార్టర్స్)ను విడిచి వెళ్లరాదని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఎల్లారెడ్డి ప్రభుత్వ జూనియర్ కళాశాల ఇన్‌చార్జి ప్రిన్సిపాల్ సస్పెన్షన్ ఘటన ప్రస్తుతం కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.

Next Story