- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
న్యూ లిటిల్ ఫ్లవర్ స్కూల్లో ఘనంగా బోనాల జాతర
మండల కేంద్రంలోని న్యూ లిటిల్ ఫ్లవర్ స్కూల్‌లో శనివారం బోనాల పండుగను ఘనంగా నిర్వహించారు.

దిశ, ఏన్కూర్ : మండల కేంద్రంలోని న్యూ లిటిల్ ఫ్లవర్ స్కూల్‌లో శనివారం బోనాల పండుగను ఘనంగా నిర్వహించారు. పాఠశాల డైరెక్టర్ పోతినేని భూమేశ్వరరావు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో చిన్నారులు పోతురాజు, బోనాల వేషధారణలో పాల్గొని తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించారు. ఈ సందర్భంగా డైరెక్టర్ పోతినేని భూమేశ్వరరావు మాట్లాడుతూ ఆషాఢ మాసం తెలంగాణ ప్రజల సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే పవిత్రమైన మాసమని అన్నారు. ఈ మాసంలో రాష్ట్రవ్యాప్తంగా భక్తిశ్రద్ధలతో బోనాల పండుగను జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోందని పేర్కొన్నారు. బోనాలు మహాకాళి అమ్మవారికి కృతజ్ఞతగా సమర్పించే నైవేద్యమని, ‘బోనం’ అంటే భోజనం అని అర్థమని వివరించారు.
మహిళలు కొత్త కుండలో అన్నం, పాలు, బెల్లంతో నైవేద్యం తయారు చేసి పసుపు, కుంకుమ, వేపాకులతో అలంకరించి అమ్మవారికి సమర్పించడం ఈ పండుగ ప్రత్యేకత అని తెలిపారు. డప్పుల మోతలు, పోతురాజు నృత్యాలు, అమ్మవారి ఊరేగింపులు బోనాల పండుగకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయని, ఈ పండుగ భక్తి, సంప్రదాయం, సంస్కృతి, ఐక్యతకు ప్రతీకగా నిలుస్తుందని అన్నారు. తెలంగాణ సంస్కృతిని భావితరాలకు పరిచయం చేయాలనే ఉద్దేశంతో పాఠశాలలో బోనాల వేడుకలు నిర్వహించినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ సాయి, ఉపాధ్యాయులు, ఉపాధ్యాయినులు, విద్యార్థులు పాల్గొన్నారు.






