- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వెంకటరెడ్డి నేను ఒకే కుటుంబం కాదు.. రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. తనకు పదవులు అడుక్కోవడం తెలియదని, కొట్లాడటమే తెలుసని అన్నారు. రాజీనామా చేసి ఉప ఎన్నికలకు వెళితే తన నియోజకవర్గానికి వంద మంది ఎమ్మెల్యేలు వచ్చారని చెప్పారు.

దిశ, వెబ్ డెస్క్: కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. తనకు పదవులు అడుక్కోవడం తెలియదని, కొట్లాడటమే తెలుసని అన్నారు. రాజీనామా చేసి ఉప ఎన్నికలకు వెళితే తన నియోజకవర్గానికి వంద మంది ఎమ్మెల్యేలు వచ్చారని చెప్పారు. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, నేను ఒకే కుటుంబం కాదు.. మేం సోదరులం అయినా మా కుటుంబాలు వేరు అని వ్యాఖ్యానించారు. మంత్రి పదవి విషయంలో వెంకటరెడ్డితో తనకు ఏం సంబంధం అని ప్రశ్నించారు. అధిష్ఠానం హామీ ఇచ్చినవారికి మంత్రి పదవులు వచ్చాయని, తనకు మాత్రమే రాలేదని అన్నారు.
గతంలోనూ రాజగోపాల్ రెడ్డి మంత్రి పదవి దక్కకపోవడంపై పలుమార్లు అసంతృప్తి వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఎన్నికలకు ముందు పార్టీలోకి వస్తే తనకు మంత్రి పదవి ఇస్తానని ఆఫర్ చేశారని కానీ అధికారంలోకి వచ్చిన తరవాత మాత్రం పదవి ఇవ్వడంలేదని రాజగోపాల్ రెడ్డి అన్నారు. ఈ విషయంపై ఆయన ఢిల్లీ పెద్దలను సైతం సంప్రదించారు. అయితే ఒకే కుటుంబంలో ఇద్దరికి మంత్రి పదవులు ఇవ్వకూడదనే రాజగోపాల్ రెడ్డికి పదవి దక్కలేదని ఓ ప్రచారం ఉంది. ఈ నేపథ్యంలో ఆయన తాజాగా చేసిన కామెంట్లు ఆసక్తికరంగా మారాయి.






