- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రైతులు సుస్థిర వ్యవసాయం దిశగా అడుగులు వేయాలి
రైతులు సుస్థిర వ్యవసాయం దిశగా అడుగులు వేయాలని, వరికి ప్రత్యామ్నాయంగా ఆయిల్ పామ్ సాగు చేసి సమృద్ధిగా ఆదాయం గడించాలని కలెక్టర్ ప్రతిమా సింగ్ సూచించారు.

దిశ, చిన్నశంకరంపేట : రైతులు సుస్థిర వ్యవసాయం దిశగా అడుగులు వేయాలని, వరికి ప్రత్యామ్నాయంగా ఆయిల్ పామ్ సాగు చేసి సమృద్ధిగా ఆదాయం గడించాలని కలెక్టర్ ప్రతిమా సింగ్ సూచించారు. చిన్నశంకరంపేట మండలం సూరారం గ్రామంలో రైతులు సత్యనారాయణ, రాజు, జగదీశ్ ల 3 ఏళ్లు నిండిన ఆయిల్ పామ్ తోట పంట కోతను ప్రారంభించారు. ఆమె మాట్లాడుతూ.. జిల్లాలో 2023-24 నుంచి ఇప్పటివరకు 1857 ఎకరాలలో ఆయిల్ పామ్ సాగయ్యిందని, 2026-27 గాను 2, 500 ఎకరాల లక్ష్యం నిర్దేశించుకోగా ఇప్పటి వరకు 693 ఎకరాల్లో రైతులు భూమి సిద్ధం కాగా 354 ఎకరాలలో తోటలు వేశారని చెప్పారు. రైతులు మార్కెట్ డిమాండ్ ఉన్న పంటలపై దృష్టి సారించాలని, వాటిలో ఆయిల్ పామ్ ఒకటన్నారు. దేశంలో ఏ పంటకు లేనివిధంగా ఆయిల్ పామ్ సాగు కొరకు చట్టం ద్వారా ప్రభుత్వం ప్రోత్సాహకాలు అందిస్తుందన్నారు.
మొక్కలపై రాయితీతో పాటు, 4 ఏళ్ల పాటు తోట నిర్వహణ, అంతర పంటల సాగు కొరకు రాయితీ సొమ్మును నేరుగా రైతు ఖాతాకు జమ అవుతుందన్నారు. ఒక రైతుకు గరిష్టంగా 12.50 ఎకరాల వరకు డ్రిప్ పరికరాలపై రాయితీ ఉంటుందన్నారు. మొక్కలు నాటిన 4 ఏళ్ల తర్వాత ఎకరానికి 10-12 టన్నుల దిగుబడి వస్తుందని, ప్రస్తుతం ఒక టన్ను గెల ధర రూ.23,852 ఉండగా, ఏడాదికి ఎకరానికి రూ.2,38,520 ఆదాయం, ఖర్చులు పోను రూ.2 లక్షల వరకు ఆదాయం పొందవచ్చన్నారు. ఎకరా వరికి పట్టే నీటితో 5 ఎకరాల ఆయిల్ పామ్ సాగు చేయవచ్చు. మధ్యవర్తులు ఉండకుండా సంబంధిత కంపెనీ నేరుగా కొనుగోలు చేస్తుందని దొంగలు, కోతుల బెడద లేని పంట అన్నారు. రైతులు ముందుకు రావాలని కోరారు. మొదటి 4ఏళ్లు పంట రాని సమయంలో అంతర పంటల ద్వారా ఆదాయం పొందవచ్చు. 5 ఏళ్ల తర్వాత కోకో, వక్క వంటి నీడను తట్టుకునే పంటలను సాగు చేసి అదనపు ఆదాయం పొందవచ్చు అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉద్యాన, పట్టు పరిశ్రమ శాఖ అధికారి ప్రతాప్ సింగ్, వ్యవసాయాధికారి లక్ష్మీ ప్రసన్న, ఉద్యాన, వ్యవసాయ విస్తరణ అధికారులు, ఎంఎస్ లివ్ పామ్ రిసోర్సెస్ ప్రై.లి కంపెనీ మేనేజర్, ప్రతినిధులు, మైక్రో ఇరిగేషన్ ప్రతినిధులు, అధిక సంఖ్యలో రైతులు పాల్గొన్నారు.






