- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు.. దూసుకొస్తున్న నైరుతి రుతుపవనాలు: ఐఎండీ
తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు పడనున్నాయి. నైరుతి రుతుపవనాలు ఈ రాష్ట్రాల వైపు వేగంగా దూసుకొస్తున్నాయని ఐఎండీ తెలిపింది.

దిశ, నేషనల్ బ్యూరో: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో భారీ వర్షాలు పడనున్నాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) తెలిపింది. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని, అదే సమయంలో ఢిల్లీ, పంజాబ్, హరియాణా, చండీగఢ్, ఉత్తర ప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాల్లో ధూళి తుఫానులు వస్తాయని ఐఎండీ తెలిపింది. అస్సాం, మేఘాలయ, అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, త్రిపుర రాష్ట్రాల్లో మే 19 వరకు భారీ నుంచి అతిభారీ వర్షాలు పడొచ్చు. దక్షిణాదిలో తమిళనాడు, కర్ణాటక, పుదుచ్చేరి, కోస్తాంధ్ర, తెలంగాణలో కూడా మరో ఐదు రోజులపాటు వర్షాలు కొనసాగే అవకాశం ఉంది.
మే 18-19 తేదీల్లో కేరళ ప్రాంతంలో భారీ వర్షాలు పడతాయని ఐఎండీ వెల్లడించింది. పశ్చిమ బెంగాల్‌లోని కొన్ని ప్రాంతాలు, సిక్కింలలో మే 19 వరకు భారీ వర్షాలు పడనున్నాయి. అలాగే ఒడిశా, జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్‌లలో మెరుపులు, గాలులతో కూడిన భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. అదే సమయంలో మధ్యప్రదేశ్‌లో ఉష్ణోగ్రతలు పెరగనున్నాయి. రాజస్థాన్, బిహార్, యూపీల్లోని కొన్ని ప్రాంతాల్లో తీవ్రమైన ఉష్ణోగ్రతలు కనిపిస్తాయి.
ఇక నైరుతి రుతుపవనాలు ప్రారంభమయ్యాయని, ఇప్పటికే మాల్దీవులు, కామోరిన్ ప్రాంతం, అరేబియా సముద్రంతోపాటు అండమాన్ వరకు ఇవి వ్యాపించాయని ఐఎండీ తెలిపింది. త్వరలోనే ఇవి రెండు తెలుగు రాష్ట్రాలను చేరుకోనున్నాయి. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో పలుచోట్ల భారీ వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే.






