- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పెళ్లి మండపంలో వరుడిపై ఉమ్మిన వధువు.. అందరి ముందే ఘోర అవమానం జరగడంతో పెళ్లి కొడుకు చేసిన పనికి అంతా షాక్..
పెళ్లి.. జీవితాంతం గుర్తుండే మధుర జ్ఞాపకాలను అందిస్తుంది. కానీ ఈ అబ్బాయికి మాత్రం అసలు గుర్తుంచుకోవద్దు అనుకునే సంఘటనను పరిచయం చేసింది. ఏడడుగులు వేస్తుండగా.. వధువు చేయి పట్టుకుని నడవాలనుకున్నాడు వరుడు

దిశ, ఫీచర్స్ : పెళ్లి.. జీవితాంతం గుర్తుండే మధుర జ్ఞాపకాలను అందిస్తుంది. కానీ ఈ అబ్బాయికి మాత్రం అసలు గుర్తుంచుకోవద్దు అనుకునే సంఘటనను పరిచయం చేసింది. ఏడడుగులు వేస్తుండగా.. వధువు చేయి పట్టుకుని నడవాలనుకున్నాడు వరుడు. ఆమెను పట్టుకోమని హ్యాండ్ ఇచ్చాడు. కానీ ఆమె షాకింగ్ రియాక్షన్ ఇచ్చింది. అదే చేతిపై ఉమ్మేసింది. అందరి ముందే ఘోరంగా అవమానించింది. దీంతో వరుడు వెంటనే ఆమెతో పెళ్లి క్యాన్సిల్ చేసుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుండగా.. నెటిజన్లు రియాక్ట్ అవుతున్నారు.
‘ఇది చాలా దారుణం’, ‘ఈమె దలైలామా సిస్టర్ అనుకుంటా.. ఉమ్ముతూ ప్రేమను పంచుతున్నట్లు చెప్తుందా ఏమిటి’, ‘ఇంత ఘోర అవమానం ఎవరు భరిస్తారు’.‘బ్రో బతికిపోయాడు’, ‘ప్రివెన్షన్ ఈజ్ బెట్టర్ ద్యాన్ ది క్యూర్ అంటే ఇదేనేమో.. ఆమె క్యారెక్టర్ ముందే తెలియడంతో వదిలించుకుని మంచి పని చేశాడు’, ‘ఇలా ఎలా ప్రవర్తిస్తారు అసలు’, ‘ఏదైనా ఉంటే ముందే చెప్పుకుని పెళ్లి ఆపేసుంటే బాగుండేది కదా.. ఇంతగా అవమానించాలా’ అని కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఎక్కడ జరిగిందనే వివరాలు తెలియకపోవడంతో.. ఇది స్కిట్ అయి ఉండొచ్చని అభిప్రాయపడుతున్నారు మరికొందరు.






