- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
FIFA WC : స్పెయిన్‌కు రూ.481 కోట్ల ప్రైజ్‌మనీ
ఫిఫా ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్‌లో విశ్వవిజేతగా నిలిచిన స్పెయిన్ జట్టు బంగారు కప్పుతో పాటు భారీ నగదు బహుమతిని కూడా సొంతం చేసుకుంది.

దిశ, వెబ్ డెస్క్ : ఫిఫా ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్‌లో విశ్వవిజేతగా నిలిచిన స్పెయిన్ జట్టు బంగారు కప్పుతో పాటు భారీ నగదు బహుమతిని కూడా సొంతం చేసుకుంది. ఈ ఏడాది ఫిఫా కేటాయించిన మొత్తం ప్రైజ్ మనీ పూల్ విలువ అక్షరాలా రూ.6,300 కోట్లు. ఇందులో టోర్నీలో నిలిచిన టాప్-4 జట్లకు భారీగానే రివార్డులు అందాయి. ఫైనల్లో అద్భుత విజయాన్ని నమోదు చేసిన ఛాంపియన్ స్పెయిన్ జట్టు అత్యధికంగా రూ.481 కోట్లు నగదు బహుమతిగా అందుకుంది. ఇక టైటిల్ పోరులో రన్నరప్‌గా నిలిచిన అర్జెంటీనా జట్టుకు రూ.317 కోట్లు దక్కాయి. టోర్నమెంట్‌లో మూడో స్థానాన్ని కైవసం చేసుకున్న ఇంగ్లాండ్ జట్టుకు రూ.279 కోట్లు లభించాయి. నాలుగో స్థానంతో సరిపెట్టుకున్న ఫ్రాన్స్ జట్టు రూ.259 కోట్లు దక్కించుకుంది.
కిలియన్ ఎంబాపేకు 'గోల్డెన్ బూట్' అవార్డు
ఈ ప్రపంచ కప్ టోర్నమెంట్‌లో ఫ్రాన్స్ జట్టు కెప్టెన్, స్టార్ స్ట్రైకర్ కిలియన్ ఎంబాపే (Kylian Mbappé) తన అసాధారణ ఆటతీరుతో ఆకట్టుకున్నాడు. టోర్నీలో రికార్డు స్థాయిలో అత్యధికంగా 10 గోల్స్ చేసినందుకు గానూ ఆయనకు ప్రతిష్టాత్మక 'గోల్డెన్ బూట్' (Golden Boot) అవార్డు లభించింది. జట్టు సెమీఫైనల్స్ దాటలేకపోయినప్పటికీ, ఎంబాపే తన వ్యక్తిగత గోల్ స్కోరింగ్ నైపుణ్యంతో టోర్నీలోనే టాప్ స్కోరర్‌గా నిలిచాడు.






