- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
CJP ఆందోళన హింసాత్మకం...118 మంది పోలీసులకు గాయాలు
CJP ఆందోళన హింసాత్మకం అయిన తరుణంలో 118 మంది పోలీసులకు గాయాలు అయ్యాయి.

దిశ, వెబ్ డెస్క్: ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద CJP కార్యకర్తల ఆందోళన హింసాత్మకంగా మారింది. పోలీసులు లాఠీచార్జ్ చేసిన నేపథ్యంలో.. ఉద్రిక్త వాతావరణం నెలకొంది. నిరసన కారుల రాళ్లదాడిలో ఏకంగా 118 మంది పోలీసులు గాయపడినట్లు అధికారులు స్పష్టం చేశారు. వీరిలో స్పెషల్, జాయింట్, అడిషనల్ కమిషనర్లు లాంటి సీనియర్ ఐపీఎస్ అధికారులు ఉన్నారు.
వాళ్లతో పాటు మహిళా పోలీసులు కూడా ఉన్నట్లు ఉన్నతాధికారులు వెల్లడించారు. పబ్లిక్ ప్రాపర్టీ, దాదాపు 20 ప్రభుత్వ వాహనాలను ఆందోళనకారులు ధ్వంసం చేసినట్లు వివరించారు. సీసీటీవీలు, మొబైల్ వీడియోల ఆధారంగా దాడికి పాల్పడిన వాళ్లను గుర్తించినట్లు స్పష్టం చేశారు. కచ్చితంగా వాళ్లపై చర్యలు ఉంటాయని కూడా వార్నింగ్ ఇచ్చారు. ఇది ఇలా ఉండగా పార్లమెంట్ ముట్టడికి ప్రయత్నించిన నిరసనకారులలో మొత్తం 70 మందిని పోలీసులు అరెస్టు చేశారు. ఇక ఈ సంఘటనపై అటు అమిత్ షా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు.






