- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ట్రైనీ ఐపీఎస్ వేధింపుల కేసు.. ఉదయ్ ఆత్మహత్యాయత్నమంతా ఓ నాటకం
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన ట్రైనీ ఐపీఎస్ వేధింపుల కేసులో ఊహించని మలుపు చోటుచేసుకుంది.

దిశ, వెబ్‌డెస్క్: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన ట్రైనీ ఐపీఎస్ వేధింపుల కేసులో ఊహించని మలుపు చోటుచేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితుడైన ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి నిన్న (సోమవారం) ఆత్మహత్యాయత్నం చేసుకుని, ఆస్పత్రి పాలైనట్లు వార్తలు రాగా.. సాయంత్రానికి సూసైడ్ నోట్ బయటికొచ్చింది. అయితే తాజాగా.. అతను సూసైడ్ అటెంప్టే చేయలేదని వైద్యులు తేల్చేశారు. ఉదయ్ కృష్ణారెడ్డికి చేసిన టెస్టుల్లో అతను ఫుల్లుగా మందుకొట్టి.. స్పృహ లేకుండా నిద్రపోయాడని తేలిందన్నారు. ఆహారం తీసుకోకుండా అతిగా మద్యం సేవించడం వల్లే అపస్మారక స్థితిలోకి వెళ్లినట్లు వివరించారు. రక్తంలో ఎలాంటి విష పదార్ధాలు లేవని తేలడంతో.. కేసును పక్కదారి పట్టించేందుకు అతను సూసైడ్ డ్రామా ఆడినట్లు పోలీసులు అంచనాకు వచ్చారు. ఆ సూసైడ్ నోట్ కూడా మద్యం మత్తులో రాసి ఉంటాడని భావిస్తున్నారు.
ఆదివారం (జులై 19) సాయంత్రం అత్తాపూర్ పోలీస్ స్టేషన్లో ఉదయ్ కృష్ణారెడ్డిపై లైంగిక వేధింపుల కేసు నమోదయింది. బాధితురాలు ఇచ్చిన వివరాలతో పోలీసులు వివిధ సెక్షన్ల కింద కేసు నమోదైంది. ఆ తర్వాత ఉదయ్ కృష్ణారెడ్డి అమీర్ పేట్ లోని తన ఫ్రెండ్ రూమ్ కు వెళ్లి.. అతిగా మద్యం తాగాడు. సోమవారం ఉదయం నిద్ర లేపినా లేవకపోవడంతో.. అతని సోదరుడు ప్రణయ్, ఇతర స్నేహితులు కలిసి ఎస్ఆర్ నగర్లో ప్రైవేట్ ఆస్పత్రికి పంపారు. ఉదయ్ బెడ్ పక్కనే మద్యం సీసాలతో పాటు శానిటైజర్ కూడా ఉండటంతో దానిని తాగి సూసైడ్ అటెంప్ట్ చేసి ఉంటాడని కంగారుపడ్డారు. బ్లడ్ శాంపిల్స్ సేకరించిన వైద్యులు.. రిపోర్టు వచ్చేవరకూ ఏమీ చెప్పలేమన్నారు. తీరా చూస్తే రిపోర్ట్స్ లో ఉదయ్ కృష్ణారెడ్డి మద్యం అతిగా తాగడం వల్లే స్పృహలేకుండా పడుకున్నట్లు తేలింది. ఈ క్రమంలో పోలీసులు నెక్స్ట్ ఏం చేస్తారు? ఉదయ్ కృష్ణారెడ్డిని ఎప్పుడు అరెస్ట్ చేస్తారు? అన్న దానిపై సందిగ్ధత నెలకొంది.






