- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పూర్వ విద్యార్థుల ఆత్మీయ కలయిక
కాలం మారినా.. పాఠశాల రోజుల్లో ఏర్పడిన స్నేహబంధం మాత్రం చిరస్థాయిగా నిలిచిపోతుందని వాణీ సింగరేణి సెకండరీ స్కూల్ పూర్వ విద్యార్థులు మరోసారి నిరూపించారు.

దిశ, యైటింక్లయిన్ కాలనీ: కాలం మారినా.. పాఠశాల రోజుల్లో ఏర్పడిన స్నేహబంధం మాత్రం చిరస్థాయిగా నిలిచిపోతుందని వాణీ సింగరేణి సెకండరీ స్కూల్ పూర్వ విద్యార్థులు మరోసారి నిరూపించారు. సెంటినరీ కాలనీలోని వాణీ సెకండరీ స్కూల్‌లో 2005–06 విద్యా సంవత్సరానికి చెందిన పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఉత్సాహభరితంగా జరిగింది. దాదాపు రెండు దశాబ్దాల తర్వాత కుటుంబ సభ్యులతో కలిసి ఒకే వేదికపై కలుసుకున్న సహచరులు పాత జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ ఆనందోత్సాహాల మధ్య గడిపారు. ఈ సందర్భంగా తమకు విద్యాబుద్ధులు నేర్పిన ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించి కృతజ్ఞతలు తెలిపారు.
విద్యార్థి దశలో జరిగిన మధుర సంఘటనలు, తరగతి గదిలోని అనుభవాలు, స్నేహితులతో గడిపిన అపురూప క్షణాలను గుర్తు చేసుకుంటూ ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకున్నారు. ఎన్నో ఏళ్ల తర్వాత కలుసుకోవడంతో పలువురు భావోద్వేగానికి లోనయ్యారు. ఈ కార్యక్రమంలో సాంస్కృతిక ప్రదర్శనలు, వినోదాత్మక ఆటలు, జ్ఞాపికల ప్రదానం ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ సందర్భంగా మాట్లాడిన ఉపాధ్యాయులు విద్యార్థులు వివిధ రంగాల్లో సాధిస్తున్న విజయాలను అభినందిస్తూ, సమాజంలో మరింత ఉన్నత స్థానాలకు ఎదగాలని ఆకాంక్షించారు. అనంతరం పూర్వ విద్యార్థులు, ఉపాధ్యాయులు, కుటుంబ సభ్యులు కలిసి గ్రూప్ ఫొటోలు దిగుతూ ఈ ఆత్మీయ కలయికను చిరస్మరణీయంగా మలిచారు. కుటుంబ సభ్యుల భాగస్వామ్యంతో కార్యక్రమం ఆప్యాయత, అనుబంధాల నడుమ సందడిగా సాగింది.






