- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఫిఫా ఫైనల్లో ఓటమి.. స్పెయిన్ ఆటగాళ్లపై దాడికి దిగిన అర్జెంటీనా ప్లేయర్స్
16 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత స్పెయిన్ జట్టు ఫిఫా ప్రపంచ కప్‌ను ముద్దాడటంతో యూరప్ అంతటా పండగ వాతావరణం నెలకొంది.

దిశ, వెబ్ డెస్క్ : 16 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత స్పెయిన్ జట్టు ఫిఫా ప్రపంచ కప్‌ను ముద్దాడటంతో యూరప్ అంతటా పండగ వాతావరణం నెలకొంది. అయితే, మ్యాచ్ ముగిసిన వెంటనే న్యూజెర్సీ మైదానంలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఓటమిని జీర్ణించుకోలేకపోయిన అర్జెంటీనా ఆటగాళ్లు తీవ్రమైన అసహనంతో స్పెయిన్ ఆటగాళ్లపై భౌతిక దాడికి దిగడం అంతర్జాతీయ ఫుట్‌బాల్ వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతోంది. స్పెయిన్ జట్టు చారిత్రాత్మక విజయం సాధించిన ఆనందంలో ఆటగాళ్లందరూ మైదానంలో ఒకరినొకరు కౌగిలించుకుంటూ సంబరాలు చేసుకుంటున్న సమయంలో అర్జెంటీనా ప్లేయర్ లియాండ్రో పరేడెస్ (Leandro Paredes) ఒక్కసారిగా దూసుకువచ్చి, స్పెయిన్ యంగ్ స్టార్ ఆటగాడు గావి (Gavi) ని అత్యంత బలంగా కిందకు తోసేసాడు. ఈ ఆకస్మిక దాడితో స్పెయిన్ ఆటగాళ్లు షాక్‌కు గురయ్యారు. పరేడెస్ చర్యను నిరసిస్తూ, గావిని రక్షించేందుకు అడ్డువచ్చిన స్పెయిన్ బృందంలోని మరో ఆటగాడిపై అర్జెంటీనా ప్లేయర్స్ మరింత రెచ్చిపోయారు. సదరు స్పెయిన్ ఆటగాడి ముఖంపై అర్జెంటీనా ప్లేయర్ ఒకరు వరుసగా పిడిగుద్దులు కురిపించాడు. దీనితో మైదానం ఒక్కసారిగా ఫుట్‌బాల్ గ్రౌండ్‌లా కాకుండా రణరంగంలా మారిపోయింది. ఇరు జట్ల ఆటగాళ్లు, సపోర్టింగ్ స్టాఫ్ పరస్పరం తోపులాటకు దిగడంతో స్టేడియంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.
రెడ్ కార్డు జారీ చేసినా..
పరిస్థితి చేతులు దాటిపోతుండటంతో మ్యాచ్ రిఫరీ వెంటనే జోక్యం చేసుకున్నారు. దాడికి పాల్పడిన అర్జెంటీనా ఆటగాళ్లకు తీవ్ర హెచ్చరికలతో కూడిన రెడ్ కార్డ్ జారీ చేశారు. అయినప్పటికీ, అర్జెంటీనా ఆటగాళ్లు ఏమాత్రం వెనక్కి తగ్గకుండా స్పెయిన్ ప్లేయర్లతో ఘర్షణను కొనసాగించారు. సెక్యూరిటీ సిబ్బంది, సీనియర్ ఆటగాళ్లు రంగంలోకి దిగి ఇరు జట్లను విడదీయడంతో గొడవ సద్దుమణిగింది. ప్రపంచ కప్ లాంటి అత్యున్నత వేదికపై, అది కూడా ఫైనల్ మ్యాచ్ ముగిసిన తర్వాత అర్జెంటీనా ఆటగాళ్లు ఈ రకమైన దురుసు ప్రవర్తనకు దిగడంపై క్రీడాభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ దాడికి పాల్పడిన ఆటగాళ్లపై ఫిఫా (FIFA) కఠినమైన క్రమశిక్షణా చర్యలు తీసుకునే అవకాశాలున్నాయి.






