ప్రపంచంలో ఇండియాదే అగ్రస్థానం.. బాధాకరమన్న కేంద్ర మంత్రి

by Dishafeatures2 |
ప్రపంచంలో ఇండియాదే అగ్రస్థానం.. బాధాకరమన్న కేంద్ర మంత్రి
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రపంచ దేశాలను వెనక్కు నెట్టి ఇండియా అగ్ర స్థానానికి చేరుకుంది. కానీ ఇది ఎంతో చింతించాల్సిన విషయం అని విశ్లేషకులు అంటున్నారు. అదేంటి.. అగ్రరాజ్యాలను సైతం వెనక్కు నెట్టి భారత్ అగ్రస్థానానికి చేరితే చింతించడం దేనికని చాలా మంది అనుకోవచ్చు. కానీ.. భారత్ అగ్రస్థానంలో ఉంది రోడ్డు ప్రమాదంలో మరణించిన వారి సంఖ్యలో. అవును ప్రపంచ దేశాలతో పోలిస్తే రోడ్డు ప్రమాదంలో ఎక్కువ మంది భారత్‌లోనే మరణించారు. ఈ విషయంపై భారత కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి గడ్కరి మాట్లాడుతూ.. రోడ్డు ప్రమాదాలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాలని అన్నారు. రోడ్డు ప్రమాదాల్లో చనిపోయిన వారి సంఖ్యలో భారత్ టాప్‌లో ఉందని బుధవారం అన్నారు.

ఇది చాలా బాధాకరమని, వీటిని నివారించేందుకు చర్యలు తీసుకోవాలని ఆయన అన్నారు. 2018 ప్రపంచ రోడ్ గణాంకాల ప్రకారం.. ప్రపంచంలో అత్యధిక రోడ్డు ప్రమాదాలు జరిగిన దేశాల్లో ఇండియా, జెనీవా మూడో ర్యాంకులో ఉన్నాయని, కానీ రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోయిన వారి జాబితాలో మాత్రం ఇండియా ప్రథమ స్థానంలో ఉందని ఆయన రాజ్యసభలో పెట్టిన లేఖలో పేర్కొన్నారు. అయితే 18 నుంచి 45 ఏళ్ల వయసు మధ్య వారిలో 69.80 మంది 2020లో రోడ్డు ప్రమాదాల్లో మరణించారని ఆయన తెలిపారు. అంతేకాకుండా సభలో మరో ప్రశ్నకు సమాధానం ఇస్తూ.. దేశంలో 22 గ్రీన్‌ఫీల్డ్ రహదారులు ( రూ.1,63,350 కోట్లతో 2,485 కిమీల పొడవుతో 5 ఎక్స్‌ప్రెస్‌వేలు,₹ 1,92,876 కోట్లతో 5,816 కి.మీ పొడవుతో యాక్సెస్ కంట్రోల్డ్ హైవేలు) నిర్మించబడ్డాయని తెలిపారు. వీటితో పాటు రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు మరెన్నో జాగ్రత్తలు తీసుకుంనేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని ఆయన తెలిపారు.

Next Story