ఉప్పల్‌లో భారీ స్కోర్ చేసిన పంజాబ్.. హైదరాబాద్ టార్గెట్ ఎంతంటే..?

by Satheesh |
ఉప్పల్‌లో భారీ స్కోర్ చేసిన పంజాబ్.. హైదరాబాద్ టార్గెట్ ఎంతంటే..?
X

దిశ, వెబ్‌డెస్క్: ఐపీఎల్ 2024లో భాగంగా ఆదివారం ఉప్పల్ స్టేడియం వేదికగా సన్ రైజర్స్ హైదరాబాద్, పంజాబ్ కింగ్స్ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో ఎస్ఆర్‌హెచ్ బౌలర్లను ధీటుగా ఎదుర్కొన్న పంజాబ్ భారీ స్కోర్ సాధించింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 215 పరుగుల భారీ స్కోర్ చేసింది. పంజాబ్ బ్యాటర్లలో అథర్వ తైదే 46, ప్రభుమాన్ సింగ్ 71 పరుగులు చేసి జట్టుకు అదిరిపోయే శుభారంభం అందించారు. చివర్లో రిలే రూసో (49), కెప్టెన్ జితేశ్ శర్మ (32 నాటౌట్) మెరుపులు మెరిపించడంతో పంజాబ్ భారీ స్కోర్ చేసింది.

తొలుత పొదుపుగా బౌలింగ్ చేసిన ఎస్ఆర్‌హెచ్ బౌలర్స్.. చివర్లో పంజాబ్ బ్యాటర్లు ఎదురు దాడికి దిగడంతో చేతులేత్తేశారు. తద్వారా పంజాబ్ భారీ స్కోర్ చేసింది. ఎస్‌ఆర్‌హెచ్ బౌలర్లలో భువనేశ్వర్ 2 వికెట్లు పడగొట్టగా, కెప్టెన్ కమిన్స్, విజయకాంత్ చెరో వికెట్ తీశారు. అనంతరం సన్ రైజర్స్ హైదరాబాద్ 216 పరుగుల లక్ష్యంతో ఛేజింగ్‌కు దిగింది. మరోవైపు ఉప్పల్ స్టేడియం పరిసర ప్రాంతాల్లో వర్షం కురుస్తుండటంతో ఎస్‌ఆర్‌హెచ్ అభిమానుల్లో టెన్షన్ నెలకొంది.

Next Story