జగ్గారెడ్డితో కేటీఆర్ ఇంట్రెస్టింగ్ చిట్ చాట్

by Rajesh |
జగ్గారెడ్డితో కేటీఆర్ ఇంట్రెస్టింగ్ చిట్ చాట్
X

దిశ, వెబ్‌డెస్క్: అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న వేళ సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి, మంత్రి కేటీఆర్ మధ్య ఇంట్రెస్టింగ్ చిట్ చాట్ నడిచింది. తొలుత మంత్రి కేటీఆర్ జగ్గారెడ్డి టీషర్ట్ ధరించి టీఎన్జీవో రాష్ట్ర అధ్యక్షుడు మామిల్ల రాజేందర్ తో కలిసి అసెంబ్లీకి రావడంతో పిల్లలతో కలిసి తిరిగితే ఎట్లన్న అన్నారు. టీషర్ట్ వేసుకుంటే పిల్లలవుతారా అని ఈ సందర్భంగా జగ్గారెడ్డి బదులిచ్చారు. మీ ఫ్రెండ్ షిప్ ఎక్కడ స్టార్ట్ అయింది అని కేటీఆర్ అనడంతో మామిల్ల స్పందిస్తూ మాది ఒకే కంచం, ఒకే మంచమన్నారు. మరి జగ్గారెడ్డిని గెలిపిస్తావా అని మంత్రి మామిళ్లను ప్రశ్నించారు. దీనికి రాజేందర్ బదులిస్తూ జగ్గారెడ్డిని గెలిపించి మన దగ్గరికి తీసుకొస్తా అన్నారు.

Next Story

Most Viewed