ఆన్‌లైన్ బెట్టింగ్‌కు యువ రైతు బలి.. ఇన్‌ష్టాగ్రామ్ ఇన్ఫ్యూలెన్సర్సే కారణమా..?

by Mahesh |
ఆన్‌లైన్ బెట్టింగ్‌కు యువ రైతు బలి.. ఇన్‌ష్టాగ్రామ్ ఇన్ఫ్యూలెన్సర్సే కారణమా..?
X

దిశ, వెబ్‌డెస్క్: ఓ యాప్‌లో బెట్టింగ్ పెట్టి లక్షలు పోగొట్టుకున్న ఓ యువ రైతు ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా చికిత్స పొందుతూ ఈరోజు మృతి చెందాడు. ఈ విషాద సంఘటన మెదక్ జిల్లాలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సోషల్ మీడియాలో వచ్చిన ప్రమోషన్ వీడియోను చూసిన యువ రైతు భాను ప్రకాశ్ ధాన్యం అమ్మిన డబ్బును ఆన్ లైన్ యాప్‌లో బెట్టింగ్ పెట్టి లాస్ అయ్యాడు. దీంతో ఏం చేయాలో తోచక ఈ నెల 13న పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇది గమనించిన కుటుంబ సభ్యులు యువకుడిని ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఈరోజు మృతి చెందాడు. ఈ సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. అలాగే బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేస్తున్న వారిపై త్వరలో చర్యలు తీసుకుంటామని తెలిపినట్లు తెలుస్తుంది.Next Story

Most Viewed