కలీస్తానీ గురుపత్వంత్ సింగ్ హత్యకు కుట్ర.. రిపబ్లిక్‌ నుంచి అమెరికాకు నిందితుడు

by Mahesh |
కలీస్తానీ గురుపత్వంత్ సింగ్ హత్యకు కుట్ర.. రిపబ్లిక్‌ నుంచి అమెరికాకు నిందితుడు
X

దిశ, వెబ్‌డెస్క్: సిక్కు వేర్పాటువాది గురుపత్వంత్ సింగ్ పన్నూన్‌ను హత్య చేయడానికి కుట్ర పన్నిన భారత జాతీయుడు నిఖిల్ గుప్తా, చెక్ రిపబ్లిక్ నుండి యునైటెడ్ స్టేట్స్‌కు తరలించారు. ఫెడరల్ బ్యూరో ఆఫ్ ప్రిజన్స్ వెబ్‌సైట్ ప్రకారం.. పన్నూన్‌ను హత్య చేసేందుకు కుట్ర పన్నారనే ఆరోపణలపై అమెరికా ప్రభుత్వ అభ్యర్థన మేరకు గత ఏడాది జూన్‌లో గుప్తాను చెక్ రిపబ్లిక్‌లో అరెస్టు చేశారు. కాగా అతన్ని ఈ రోజు చెక్ రిపబ్లిక్‌ నుంచి అమెరికాకు తరలించారు. సోమవారం న్యూయార్క్‌లోని ఫెడరల్ కోర్టు ముందు హాజరుపరిచే అవకాశం ఉంది. కాగా గతంలో అమెరికా వేదికగా పన్ను హత్య కుట్ర జరిగిందని.. దానిని తాము భగ్నం చేశామని అమెరికా వెల్లడించిన విషయం తెలిసిందే. కాగా భారతీయుడైన నిఖిల్ పన్ను హత్యకు సుపారీ ఇచ్చినట్లు అమెరికా అభియోగాలు మోపింది.Next Story

Most Viewed