- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఏపీపీఎస్సీ ఛైర్ పర్సన్ గా అనురాధ నియామకం
ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(APPSC) ఛైర్ పర్సన్ గా రిటైర్డ్ ఐపీఎస్ అనురాధను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

X
దిశ, వెబ్ డెస్క్ : ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలో కీలక పాత్ర పోషించే పబ్లిక్ సర్వీస్ కమిషన్ కు ఛైర్ పర్సన్ ను నియమించింది. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(APPSC) ఛైర్ పర్సన్ గా రిటైర్డ్ ఐపీఎస్ అనురాధను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ఏపీ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. కాగా అనురాధ ఇదివరకు హోంశాఖ సెక్రెటరీగా, ఇంటలిజెన్స్ చీఫ్ గా విధులు నిర్వర్తించారు. గత జూన్ లో ఏపీపీఎస్సీ ఛైర్ పర్సన్ గా ఉన్న గౌతం సవాంగ్ ఏపీలో జరిగే గ్రూప్ 1 పరీక్షలు వాయిదా వేసిన అనంతరం అనూహ్యంగా తన పదవికి రాజీనామా చేశారు. అప్పటి నుండి ఈ పదవి ఖాళీగానే ఉంది.
- Tags
- APPSC
Next Story






