- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
భద్రాచలం గోదావరి వంతెనపై మహిళ ఆత్మహత్యాయత్నం
కుటుంబ తగాదాలు, ఆస్తి వివాదాలు తారాస్థాయికి చేరడంతో మంగళవారం ఓ మహిళ భద్రాచలం వద్ద గోదావరి నదిలో దూకి ఆత్మహత్య చేసుకునేందుకు యత్నించింది.

దిశ,బూర్గంపాడు: కుటుంబ తగాదాలు, ఆస్తి వివాదాలు తారాస్థాయికి చేరడంతో మంగళవారం ఓ మహిళ భద్రాచలం వద్ద గోదావరి నదిలో దూకి ఆత్మహత్య చేసుకునేందుకు యత్నించింది. అయితే అక్కడే ఉన్న స్థానికులు, వాహనదారులు సమయస్ఫూర్తితో వ్యవహరించి ఆమెను సురక్షితంగా కాపాడారు. ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.. ములకలపల్లి మండలం పొగళ్లపల్లి గ్రామానికి చెందిన గొళ్లమూడి శైలజ(37) అనే మహిళ గోదావరి వంతెనపై నుంచి నదిలోకి దూకేందుకు సిద్ధపడింది. గమనించిన స్థానికులు వెంటనే స్పందించి ఆమెను పట్టుకుని అడ్డుకున్నారు. అనంతరం వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం అందించారు.
సమాచారం అందుకున్న బూర్గంపాడు పోలీసులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. కన్నీరు మున్నీరవుతున్న శైలజను ఓదార్చి, ఆమెను సురక్షితంగా పోలీస్ స్టేషన్‌కు తరలించారు. పోలీసుల విచారణలో బాధితురాలు శైలజ తన ఆవేదనను వ్యక్తపరిచారు. తన సొంత ఇంటి స్థలాన్ని ఆమె మరిది గొల్లపూడి రమేష్ అక్రమంగా ఆక్రమించుకున్నారని తెలిపారు. అంతేకాకుండా తన భర్తపై అన్యాయంగా పలు రకాల కేసులు పెట్టించి వేధింపులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. ఈ విషయమై గత ఐదు నెలలుగా న్యాయం కోసం తిరుగుతున్నా అధికారుల నుంచి సరైన స్పందన లభించలేదని,తీవ్ర మనస్తాపానికి గురై ఈ ప్రాణత్యాగానికి పూనుకున్నట్లు కన్నీటిపర్యంతమయ్యారు. ఘటనపై బూర్గంపాడు పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. శైలజకు కౌన్సిలింగ్ ఇచ్చి, ఆమె ఆరోపణలపై చట్టరీత్యా విచారణ జరిపి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.






