టాక్సిక్’ సినిమా నుంచి సెకండ్ సింగిల్ విడుదల.. నగ్నంగా రెచ్చిపోయిన తారా సుతారియా

by Mallepaka Hamsa |

ఈ రెండో పాటలో మొదటిదాన్ని మించిన తీవ్రమైన రొమాన్స్‌ను చూపించారు.

టాక్సిక్’ సినిమా నుంచి సెకండ్ సింగిల్ విడుదల.. నగ్నంగా రెచ్చిపోయిన తారా సుతారియా
X

దిశ, సినిమా: రాకింగ్ స్టార్ యష్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ పాన్-ఇండియా మూవీ ‘టాక్సిక్’. ఈ సినిమా ఆగస్ట్ 26న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రాబోతోంది. విడుదల తేదీ దగ్గరపడుతుండటంతో మ్యూజికల్ జర్నీని ప్రారంభించిన చిత్రబృందం, వరుసగా పాటలను విడుదల చేస్తూ సినిమాపై క్యూరియాసిటీని పెంచేస్తోంది. ఇప్పటికే వచ్చిన మొదటి పాట ‘తబాహి’తో బోల్డ్, రొమాంటిక్ వైబ్‌ను పరిచయం చేసిన టీమ్.. తాజాగా ‘మనసు ఆగదు’ అంటూ సాగే రెండో పాటను విడుదల చేసింది. ఈ రెండో పాటలో మొదటిదాన్ని మించిన తీవ్రమైన రొమాన్స్‌ను చూపించారు. బాలీవుడ్ బ్యూటీ తారా సుతారియా బాత్‌టబ్‌లో నగ్నంగా ఎంట్రీ ఇవ్వగా, అక్కడే ఉన్న యష్ ఆమెకు ప్రేమిస్తున్నట్లు చెప్పి గన్‌తో ఎంగేజ్‌మెంట్ రింగ్ తొడిగే సీన్ ఆకట్టుకుంటుంది. ఆ తర్వాత ఇద్దరూ ఒకే దుప్పటి కప్పుకుని వర్షంలో బాల్కనీలో సాగించే రొమాన్స్, కేఫ్‌లో అందరిముందే ముద్దులతో రెచ్చిపోయే సీన్స్ సాంగ్‌లో విపరీతంగా హైలైట్ అయ్యాయి. ప్రస్తుతం ఈ సాంగ్ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. కాగా.. లేడీ డైరెక్టర్ గీతూ మోహన్‌దాస్ తెరకెక్కిస్తున్న ఈ మోస్ట్ క్రేజీ ప్రాజెక్ట్‌లో నయనతార, కియారా అద్వానీ, రుక్మిణి వసంత్, తారా సుతారియా, హుమా ఖురేషి కీలక పాత్రలు పోషిస్తున్నారు. గ్యాంగ్‌స్టర్ బ్యాక్‌డ్రాప్‌లో రాబోతున్న ఈ సినిమాకు విశాల్ మిశ్రా, కనిష్క్ బాగ్చి సంగీతం అందిస్తున్నారు. కెవిఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. ఇక ఈ సెకండ్ సింగిల్‌తో సినిమాపై అంచనాలు మరింత పెరిగిపోయాయి.



Next Story