యువత భవిష్యత్తు పై చర్చించని పార్లమెంట్ ఎందుకు.. లోక్‌సభ స్పీకర్‌కు రాహుల్ గాంధీ లేఖ

by Malleboina Mahesh |

పరీక్షా పత్రాల లీకేజీ సంక్షోభంపై పార్లమెంట్‌లో తక్షణమే సమగ్ర చర్చ చేపట్టాలని లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) డిమాండ్ చేశారు.

యువత భవిష్యత్తు పై చర్చించని పార్లమెంట్ ఎందుకు.. లోక్‌సభ స్పీకర్‌కు రాహుల్ గాంధీ లేఖ
X

దిశ, వెబ్ డెస్క్: ఢిల్లీలో నిరసన తెలుపుతున్న విద్యార్థులపై పోలీసులు జరిపిన లాఠీచార్జ్, దాడి ఘటనలతో పాటు పరీక్షా పత్రాల లీకేజీ సంక్షోభంపై పార్లమెంట్‌లో తక్షణమే సమగ్ర చర్చ చేపట్టాలని లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. ఇండియా కూటమికి చెందిన ఇతర ఎంపీలతో కలిసి ఆయన లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాను కలిసి వినతిపత్రం అందించారు. తమ భవిష్యత్తు గురించి న్యాయమైన ప్రశ్నలు అడిగిన విద్యార్థులపై పోలీసులు విచక్షణారహితంగా దాడి చేయడం దారుణమని, విద్యార్థుల సమస్యలు, ప్రభుత్వం వహిస్తున్న బాధ్యతారాహిత్యంపై చట్ట సభల్లో చర్చ జరగాల్సిందేనని రాహుల్ స్పష్టం చేశారు.

భారత యువత భవిష్యత్తు గురించి మాట్లాడని పార్లమెంట్ ఉండి కూడా దండగేనని రాహుల్ గాంధీ మండిపడ్డారు. విద్యార్థులపై జరిగిన ఈ అన్యాయాన్ని ప్రభుత్వం తొక్కు పెట్టడానికి ప్రతిపక్షాలు ఎంతమాత్రం ఒప్పుకోవని తేల్చి చెప్పారు. నిరసన తెలుపుతున్న విద్యార్థుల గొంతుక వీధుల్లోనే కాకుండా పార్లమెంట్ వేదికగా కూడా ప్రతిధ్వనించేలా ప్రతిపక్షాలు పోరాడుతాయని, వారికి పూర్తి న్యాయం జరిగే వరకు వెనక్కి తగ్గేదే లేదని రాహుల్ గాంధీ స్పీకర్ కి ఇచ్చిన వినతి పత్రంలో పేర్కొన్నారు.

Next Story