నేరస్థుడికి శిక్ష పడితే ఇండస్ట్రీ సంతోషిస్తుంది.. దర్శన్ కేసుపై హీరో సుదీప్ షాకింగ్ కామెంట్స్..

by Kavitha |
నేరస్థుడికి శిక్ష పడితే ఇండస్ట్రీ సంతోషిస్తుంది.. దర్శన్ కేసుపై హీరో సుదీప్ షాకింగ్ కామెంట్స్..
X

దిశ, సినిమా: రేణుకా స్వామి హత్య కేసులో కన్నడ హీరో దర్శన్, నటి పవిత్రగౌడతోపాటు మరో పదమూడు మందిని అరెస్ట్ చేశారు బెంగళూరు పోలీసులు. శనివారం ఈ కేసుపై విచారణ జరిపిన కోర్టు దర్శన్, పవిత్రగౌడతోపాటు మిగతా నిందితులను మరో ఐదు రోజులు కస్టడీలోకి తీసుకోవాలని ఆదేశించింది. దర్శన్ కేసుపై ఇప్పటికే పలువురు కన్నడ సెలబ్రెటీలు స్పందించారు. తాజాగా హీరో సుదీప్ సైతం దర్శన్ కేసుపై షాకింగ్ కామెంట్స్ చేశారు.

ఆయన మాట్లాడుతూ..ఇదంతా నాకు తెలుసు. మీరు (మీడియా) ఏం చూపిస్తున్నారో మాకు తెలుసు. నిజానిజాలను బయటకు తీసుకురావడానికి మీడియా, పోలీసు సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఇందులో రెండో మాట లేదు నాకు తెలిసి ఈ కేసు విషయంలో సీఎం స్వయంగా చాలా కఠినంగా వ్యవహరిస్తున్నారని ఇటీవల మీ వార్తల్లో చూశాను. కర్ణాటకలో పెద్ద పదవిలో ఉన్న ఆయన మీడియా, పోలీసులు సక్రమంగా పనిచేస్తుంటే సామాన్యుడిగా ఆ ఆర్టిస్ట్ పేరు రాదని నా అభిప్రాయం.

నేను వారికి మద్దతుగా మాట్లాడటం చాలా తప్పు. అలాగే వ్యతిరేకంగా మాట్లాడినా తప్పే అవుతుంది. ఆ కుటుంబానికి న్యాయం జరగాలి. ఆ అమ్మాయికి న్యాయం జరగాలి. రోడ్డుపై అనాధ శవంలా పడిపోయిన రేణుక స్వామి కుటుంబానికి న్యాయం జరగాలి. పుట్టబోయే బిడ్డకు న్యాయం చేయాలి. అన్నింటికీ మించి న్యాయంపై అందరికీ నమ్మకం ఉండాలి అంటే ఈ కేసులో మంచి న్యాయం జరగాలి. సినీ పరిశ్రమకు న్యాయం జరగాలి. అన్ని కారణాలను చిత్ర పరిశ్రమపై నిందలు వేయడం సబబు కాదు. ఇండస్ట్రీకి క్లీన్ చిట్ కావాలి. ఎందుకంటే చాలా మంది కళాకారులు ఉన్నారు. దోషికి శిక్ష పడితే సినీ పరిశ్రమ సంతోషిస్తుందని కిచ్చా సుదీప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఈ కామెంట్స్ నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.Next Story

Most Viewed