ముస్లింల ఓట్లు వేయించుకుని సైలెంట్.. అసదుద్దీన్ సంచలన ట్వీట్

by Rajesh |
ముస్లింల ఓట్లు వేయించుకుని సైలెంట్.. అసదుద్దీన్ సంచలన ట్వీట్
X

దిశ, వెబ్‌డెస్క్: బక్రీద్ వేళ ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ ట్విట్టర్ వేదికగా సంచలన ట్వీట్ చేశారు. ఫ్రిడ్జ్‌లో ఉన్న మాసం బీఫ్ అని ఆరోపిస్తూ 2015లో అఖ్లాక్ ఇంట్లో కొంత మంది చొరబడి చంపేశారని తెలిపారు. స్మగ్లింగ్, దొంగతనం వంటి తప్పుడు ఆరోపణలతో ఎంత మంది ముస్లింలను చంపారో ఎవరికి తెలుసు.. గతంలో ఆగంతకులు చేసిన పని ఇప్పుడు ప్రభుత్వం చేస్తోంది. మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఫ్రిడ్జ్‌లో బీఫ్ ఉందనే కారణంతో 11 ఇళ్లను బుల్డోజ్ చేశారని తెలిపారు. ఎన్నికల ముందు తర్వాత అన్యాయమనే చక్రం మాత్రం ఆగడం లేదు అని ఆందోళన వ్యక్తం చేశారు. కేవలం ముస్లింల ఇళ్లు మాత్రమే కూలగొడుతున్నారని.. ముస్లింలు మాత్రమే హత్యలకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ముస్లిం ఓట్లు వేయించుకున్న వాళ్ల ఈ విషయంపై ఎందుకు మౌనంగా ఉన్నారని అసదుద్దీన్ ప్రశ్నించారు.Next Story

Most Viewed