బక్రీద్ ఎఫెక్ట్.. హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు ఇవే..!

by Rajesh |
బక్రీద్ ఎఫెక్ట్.. హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు ఇవే..!
X

దిశ, వెబ్‌డెస్క్: నేడు బక్రీద్ సందర్భంగా హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. పాతబస్తీతో పాటు మాసబ్ ట్యాంక్, మీరాలం దర్గా, లంగర్ హౌజ్ దగ్గర ట్రాఫిక్ మళ్లింపులు ఉంటాయని పోలీసులు తెలిపారు. నేడు ఉదయం 8గంటల నుంచి 11.30 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉంటాయని పోలీసులు తెలిపారు. బహదూర్‌పురా క్రాస్ రోడ్స్, పురానాపూల్, కామతిపూరా, కిషన్ బాగ్ వైపు నుంచి ప్రార్థనల కోసం వచ్చే వాహనాలకు మాత్రమే పర్మిషన్ ఉంటుందని పోలీసులు తెలిపారు. వాహనదారులు జూపార్క్, మసీద్ అల్లా హు అక్బర్ ఎదురుగా వాహనాలు పార్కింగ్ చేసుకోవాలన్నారు. ఇతర వాహనదారులు ఆల్టర్నేట్ రూట్లలో వెళ్లాలని ట్రాఫిక్ పోలీసులు సూచించారు.Next Story

Most Viewed