సైలెంట్‌గా మరో ఓటీటీలోకి వచ్చేసిన లవ్ మీ.. ఎందులో స్ట్రీమింగ్ అంటే?

by Jakkula Samataha |
సైలెంట్‌గా మరో ఓటీటీలోకి వచ్చేసిన లవ్ మీ.. ఎందులో స్ట్రీమింగ్ అంటే?
X

దిశ, సినిమా : బేబీ మూవీ ఫఏమ్ వైష్ణవి శైతన్య, ఆశిష్ రెడ్డి జంటగా నటించిన సినిమా లవ్ మి ఇఫ్ యు డేర్. ఈ మూవీ మే 25న థియేటర్ల వద్ద రిలీజై అంతగా సక్సెస్ కాలేకపోయింది. దీంతో ఈ మూవీ జూన్ 14 నుంచి స్ట్రీమింగ్‌కు వచ్చేసింది. ఓటీటీ ఫ్లాట్ ఫామ్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ అవుతున్న విషయం అందరికీ తెలిసిందే. అయితే తాజాగా ఎలాంటి సమాచారం లేకుండా ఈ సినిమా మరో ఓటీటీలోకి కూడా వచ్చేసింది. రొమాంటిక్ హారర్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమా ఆహా ఓటీటీలోకి ఆదివారం అర్థరాత్రి వచ్చి స్ట్రీమింగ్ అవుతున్నట్లు ఆహా ప్లాట్ ఫామ్ తన అధికారిక ఎక్స్ ఖాతా ద్వారా తెలిపింది. ఇక ఇందులో వైష్ణవి చైతన్య, ఆశిష్ మేయిన్ రోల్‌లో నటించారు. అరుణ్ బీమవరపు మూవీని తెరకెక్కించారు. ఇక దెయ్యంతో ప్రేమ అనే కాన్సెప్ట్‌తో వచ్చిన ఈ సినిమా ఓటీటీలో ఎలాంటి టాక్ సొంతం చేసుకుంటుందో చూడాలి మరి అంటున్నారు ప్రేక్షకులు.Next Story

Most Viewed