15 రోజుల నుంచి తండా వాసులకు భగీరథ నీళ్లు కరువు

by Mahesh |
15 రోజుల నుంచి తండా వాసులకు భగీరథ నీళ్లు కరువు
X

దిశ, అల్లాదుర్గం: రాష్ట్ర ప్రభుత్వం మిషన్ భగీరథ పథకం పైప్ లైన్ ద్వారా ప్రతి గడప గడపకు మంచి నీళ్ళు అందించి, ప్రజల దాహార్తిని తిరుస్తున్నామని చెబుతున్నారే తప్ప గ్రామాల్లో అమలు కావడం లేదు. మెదక్ జిల్లా అల్లాదుర్గం మండలంలోని ముప్పారం తండా లో గత 15 రోజులుగా త్రాగు నీరు అందడం లేదని తండా వాసులు ఆరోపించారు. గతంలో కూడా పలుమార్లు తండా వాసుల దాహార్తిని తీర్చడం కోసం "దిశ దిన పత్రిక" ప్రత్యేక కథనాలు ప్రచురించిన అధికారుల్లో ఎలాంటి చలనం కనిపించడం లేదని ఆరోపించారు. కనీసం మండల స్థాయి అధికారులు ఒక్కనాడైనా తండాను పర్యటించి తమ సమస్యలను అడిగి తెలుసుకున్నా దాఖలాలు లేవన్నారు. తండా అంటే చాలు అసలు పట్టించుకోరు పలకరించారు. తండా వాసులను అవహేళన చేస్తున్నారని మండిపడ్డారు. పత్రికల్లో వార్తలు వస్తే తప్ప నీళ్లు రావడం లేదు అది కూడా రెండు, మూడు రోజులే నీళ్లు వస్తాయి. మరుసటి రోజు నుండి మరల అదే తంతు, అధికారుల తీరు మారదు. మాకు నీళ్లు అందవు.. ఇక మా బ్రతుకులు అంతేనా.. కనీసం పట్టించుకునే నాధుడే కారువయ్యారు అంటూ తండా వాసులు తమ గోడును వెళ్లబోసుకున్నారు.



Next Story

Most Viewed