రైల్వే గార్డ్‌ల పనిభారం తగ్గించాలి: ఎస్పీ సింగ్

by Web Desk |
రైల్వే గార్డ్‌ల పనిభారం తగ్గించాలి: ఎస్పీ సింగ్
X

దిశ, హన్మకొండ టౌన్: ఆల్ ఇండియా గార్డ్ కౌన్సిల్ ఏఐజీసీ డివిజినల్ కార్యవర్గ కమిటీ సమావేశం ఆదివారం కాజీపేట్‌లో జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ఎస్పీ సింగ్ జనరల్ సెక్రెటరీ న్యూఢిల్లీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. డివిజన్‌లోని గార్డులు ఎదుర్కొంటున్న సమస్యలపై కూలంకుషంగా చర్చించారు. నిబంధనలకు విరుద్ధమైన విధులు నిర్వహించాలని అధికారులు ఆదేశించడం సమంజసం కాదని ఆయన ధ్వజమెత్తారు. దీనికి నిదర్శనమే ఇటీవల సీనియర్ డీఎంఓ అడ్మినిస్ట్రేషన్ అధికారి సదరు బండి స్టాండింగ్ సెక్యూర్ విషయంలో సంబంధిత పాయింట్స్మెన్ ఉద్యోగి నిర్వహించే విధులను గార్డులను విలీనం చేస్తూ ఆ పని నిర్వర్తించాలని ఆదేశాలు జారీ చేయడం సరికాదన్నారు.

లైన్ బాక్సులను తీసివేసే నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నట్లు తెలిపారు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గార్డులను ట్రైన్ మేనేజర్‌గా మార్చడంపై సంతోషాన్ని వ్యక్తం చేశారు. సికింద్రాబాద్ డివిజనల్ అడ్మినిస్ట్రేషన్ అధికారులు గార్డులను అనేక ఇబ్బందులకు గురి చేస్తున్నారని పద్ధతి మర్చికోవాలని హెచ్చరించారు. అంతేగాకుండా సీనియర్ డీఎంఓ అడ్మినిస్ట్రేషన్ సికింద్రాబాద్ అధికారులు గార్డులను పని ఒత్తిడి చేస్తే ఏఐజీసీ ఉద్యోగుల పక్షాన పోరాటం చేస్తుందని ఎస్పీ సింగ్ హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో విజయవాడ బ్రాంచ్ సెక్రెటరీ మోహన్ దాస్, సికింద్రాబాద్ డివిజన్ ప్రెసిడెంట్ కీర్తి వాసన్, సురేష్, సికింద్రాబాద్ డివిజనల్ సెక్రెటరీ తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed