ఇండియా కూటమి గెలిచిన వెంటనే ఆ పని చేయిస్తా: అఖిలేష్

by GSrikanth |
ఇండియా కూటమి గెలిచిన వెంటనే ఆ పని చేయిస్తా: అఖిలేష్
X

దిశ, వెబ్‌డెస్క్: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై సమాజ్‌వాది పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ కీలక వ్యాఖ్యలు చేశారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్రంలో ఇండియా కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే ఈడీ, సీబీఐని మూసివేసేందుకు తాను ప్రతిపాదిస్తానని సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రతి రాష్ట్రంలో అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) ఉందని.. అలాంటప్పుడు ఈడీ, సీబీఐ ఎందుకు అని ప్రశ్నించారు. మోసాలకు పాల్పడితే ఆదాయపన్ను(ఐటీ) అధికారులు చూసుకుంటారు అని అన్నారు. ఈడీ, సీబీఐ వంటి సంస్థలను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తమ రాజకీయ అవసరాలకు వాడుకుంటోందని ఆరోపించారు.

స్వచ్ఛంద సంస్థలను దుర్వినియోగం చేస్తోందని అన్నారు. 400 సీట్లు వస్తాయని ప్రచారం చేస్తే ప్రజల్లో కూడా మార్పు వస్తుందని వ్యూహాత్మకంగా ప్రచారం చేస్తున్నారని అన్నారు. 200 లకు మించి ఒక్క సీటు కూడా బీజేపీకి ఎక్కువ రాదని తెలిపారు. కాగా, ఇవాళ అఖిలేశ్ రాహుల్ గాంధీతో ప్రచారం నిర్వహించారు. సభకు ముందు అనుకోని ఘటన చోటుచేసుకుంది. జనం దూసుకురావడంతో హెలీకాప్టర్ ల్యాండింగ్‌కు చాలా ఇబ్బంది కలిగింది. దీంతో నేతలిద్దరూ ఎలాంటి ప్రసంగం చేయకుండా అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఫుల్‌పూర్ లోక్‌సభ స్థానంలో రాహుల్, అఖిలేష్ ఉమ్మడి బహిరంగ సభ జరగాల్సి ఉంది.

Next Story