వికారాబాద్ జిల్లాలో తీవ్ర విషాదం.. పిడుగు పాటుకు ముగ్గురు మృతి

by Satheesh |
వికారాబాద్ జిల్లాలో తీవ్ర విషాదం.. పిడుగు పాటుకు ముగ్గురు మృతి
X

దిశ, వెబ్‌డెస్క్: వికారాబాద్ జిల్లాలో తీవ్ర విషాదం నెలకొంది. యాలాల్ మండల పరిధిలోని వేర్వేరు ప్రాంతాల్లో పిడుగు పాటుకు గురై ఆదివారం ముగ్గురు మృతి చెందారు. మండల పరిధిలోని బంటుపల్లిలో ఇద్దరు, బెన్నూర్‌లో ఒకరు మరణించారు. మృతులను ఎంకప్ప (60), లక్ష్మప్ప (49), శ్రీనివాస్ (28)గా గుర్తించారు. పిడుగు పాటుకు గురై మరో మహిళకు తీవ్ర గాయాలు అయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని వివరాలు ఆరా తీస్తున్నారు. భారీ వర్షాలు కురిసే వేళ బయటకు వెళ్లొద్దని ప్రజలకు సూచించారు. కాగా, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Next Story

Most Viewed