ఐదు కోట్లకు అమ్ముడు పోయే రకం కాదు బీఆర్ఎస్ కార్పొరేటర్‌లు : శాంతి శ్రీనివాస్ రెడ్డి

by Disha Web Desk 23 |
ఐదు కోట్లకు అమ్ముడు పోయే రకం కాదు బీఆర్ఎస్ కార్పొరేటర్‌లు : శాంతి శ్రీనివాస్ రెడ్డి
X

దిశ, అల్వాల్: అల్వాల్, మల్కాజిగిరి బీఆర్ఎస్ కార్పొరేటర్లు ఐదు కోట్లకు అమ్ముడుపోయి అధికార పార్టీకి అంటకడుతున్నారని ఎమ్మెల్యే మైనంపల్లి ఆరోపణలు కార్పొరేటర్లు తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు బుధవారం అల్వాల్ కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మైనంపల్లి చిట్టా విప్పారు. తన కుమారుడి బీఆర్ఎస్ టికెట్ ఇవ్వనందుకు పార్టీ మారి కాంగ్రెస్ లో చేరిన మైనంపల్లి హన్మంతరావు బీఆర్ఎస్ కార్పొరేటర్లపై డబ్బులకు అమ్ముడు పోయారాంటూ ఆరోపణలు చేయడం తగదన్నారు. మీరు మొన్నటి వరకు ఇదే పార్టీ ఎమ్మెల్యేగా కొనసాగారు. అప్పుడు మా పనితీరు అర్థం కాలేదా అని ప్రశ్నించారు. ఇప్పుడు మీకు అమ్ముడు పోయేవారిలా కనిపిస్తున్నామా మీ కండ్లకు అని నిలదీశారు. మేము అమ్ముడు పోలేదు ఓట్లు వేసి గెలిపించిన ప్రజలకు న్యాయం చేయాలని వారికి కావలసిన అభివృద్ధి చేయాలనుకోవడం తప్ప మాకు వేరే వ్యాపకాలు లేవన్నారు.

మీరు పార్టీ మారినట్లు మీతో పాటు మేము వస్తే ఈ ఆరోపణలు చేసేవారు కాదు కదా అంటున్నారు. మీ కొడుకు కోసం మీరు త్యాగం చేయాలి అందుకు చేశారు కూడా మేమెందుకు చేస్తాం అంటూ మాకు రాజకీయ భిక్ష పెట్టిన పార్టీలో ఉండడం మా హక్కు అందులోనే ఉండి మా అభ్యర్థిని గెలిపించుకుంటామన్నారు. నిజంగా మీరు చేసిన ఆరోపణలపై నిలబడాలనుకుంటే ఒక రోజు డేట్ పెట్టండి మీరు నమ్మే అమ్మవారి గర్భగుడిలో మేము ఎలాంటి డబ్బులు తీసుకోలేదని పసుపు బియ్యం తో ప్రమాణం చేస్తాం మీరు అదే గర్భ గుడిలో స్నానం చేసి తడి బట్టలతో పసుపు బియ్యం తో ప్రమాణ చేస్తావా అని సవాల్ విసిరారు. రాజకీయ నాయకులు పార్టీలు మారడం ఈ రోజుల్లో సాధారణంగా మారింది. అందులో మీరు ఒక్కరు అంతవరకు భాగానే ఉంది మీతో పాటు మేమంతా లేదని తప్పుడు ఆరోపణలు చేసి ప్రజల్లో గందరగోళం సృషించడం తగదన్నారు.

మల్కాజిగిరి ప్రజలు చాలా చైతన్యవంతులని వారికి ఎవ్వరి చరిత్ర ఎందో మనకన్న వారికే ఎక్కువ తెలుసన్నారు. మీరు అనేక సందర్భాలలో చెప్పినట్లు ఎన్నికలప్పుడే రాజకీయలు తరువాత పార్టీలకు అతీతంగా ప్రజల అభివృద్ధికి పాటు పడవలసిన వారమే వారి బస్తీలు కాలనీల్లో అభివృద్ది చేయడం మన విధి కోరుకోవడం వారి విధి అన్నారు. అందుకోసం మేం గెలిచిన ఓడిన ప్రజల పక్షాన ఉండడానికి మేము సిద్ధం మీరు అందుకు సిద్దామా? లేక గెలిచిన ఓడినా అదిరింపులు బెదిరింపులతో రాజకీయం చేయాలనుకోవడం అవివేకమని మల్కాజిగిరి ప్రజలు గుండాగిరి సహించరని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వెంకటాపురం కార్పొరేటర్ సబిత అనిల్ కిషోర్ గౌడ్. నేరేడ్మ్ ట్ 135 డివిజన్ కార్పొరేటర్ కొత్తపల్లి మీనా ఉపేందర్ రెడ్డి, గౌతం నగర్ 141 డివిజన్ కార్పొరేటర్ సునీత రాము యాదవ్ సీనియర్ నాయకులు ఉద్యమకారులు గొట్టెముక్కుల శ్రీనివాస్ గౌడ్, ఢిల్లీ పరమేష్, కరం చంద్, రాపర్తి చంద్రశేఖర్, మల్లేష్ గౌడ్, ప్రేమ్ కుమార్ పాల్గొన్నారు.

Next Story